ఆటోడ్రైవర్‌ నిజాయతీ | auto driver loyalty | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ నిజాయతీ

Published Tue, Jan 31 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

ఆటోడ్రైవర్‌ నిజాయతీ

ఆటోడ్రైవర్‌ నిజాయతీ

– రూ.45 వేల నగదు, బంగారు ఉంగరాన్ని పోలీసులకు అప్పగింత
గుడిబండ (మడకశిర) : ఓ ఆటోడ్రైవర్‌ నిజాయతీని ప్రజలు, పోలీసులు మెచ్చుకున్నారు. గుడిబండ మండలం మేకలగట్టకు చెందిన రమేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ గుడిబండ– మడకశిర మధ్య ఆటోను నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం తన ఆటోలో మడకశిర మండలం పాపసానిపల్లికి చెందిన శాంతమ్మ కదిరేపల్లి క్రాస్‌లో ఎక్కి, మడకశిరలో దిగేటప్పుడు బ్యాగును మరిచిపోయింది.

ఈవిషయాన్ని ఆటో డ్రైవర్‌ రమేష్‌ గుర్తించాడు. అందులో చూడగా రూ.45 వేల నగదు, ఒక బంగారు ఉంగరం ఉంది. వెంటనే గుడిబండకు వెళ్లి విషయాన్ని ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌కు వివరించాడు. తనకు దొరికిన రూ.45వేల నగదు, బంగారు ఉంగరాన్ని ఎస్‌ఐకు అప్పగించాడు. ఈ నగదు, బంగారు ఉంగరాన్ని ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ శాంతమ్మకు అందజేశారు. పోలీసులు, ప్రజలు ఆటో డ్రైవర్‌ నిజాయతీని మెచ్చుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement