
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయానసంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు తక్కువ ధరల్లో విమాన టికెట్ల సేల్‌ను ప్రకటించింది. ఇంటీవల వాలెంటైన్స్‌డే సేల్ ను ప్రకటించిన ఇండిగోతాజాగా అంతర్జాతీయ రూట్లలో డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల అమ్మకాన్ని మంగళవారం ప్రారంభించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. నేటి (ఫిబ్రవరి 18, 2020) నుంచి ఫిబ్రవరి 21 వరకు సేల్ అందుబాటులో వుంటుంది. అన్నిచార్జీలు కలిపి ఈ డిస్కౌంట్ టికెట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు రూ. 3499 రూపాయల నుండి ప్రారంభం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా అంతర్జాతీయ విమానాలలో మార్చి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ కాలానికి వినియోగించుకోవచ్చు. ఈ సేల్ లో మొత్తం 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment