Google Pixel XL
-
గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్‌పై భారీ డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను అమెజాన్ ఇండియా ప్రస్తుతం రూ.39,990కు తగ్గించింది. అసలు ఈ ఫోన్ ధర రూ.76వేలు. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్‌పై రూ.36,010 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిసింది. అంటే దాదాపు 47 శాతం డిస్కౌంట్ అన్నమాట. ఒక్క పిక్సెల్ ఎక్స్ఎల్పైనే మాత్రమే కాక, కొత్త గూగుల్ ఫోన్ పిక్సెల్ 2పై కూడా అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ భారీ మొత్తంలో డిస్కౌంట్ అందిస్తుంది. 64జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.61వేల నుంచి రూ,49,999కు ప్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాక అదనంగా ఎక్స్చేంజ్పై రూ.18వేల తగ్గింపును అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన పిక్సెల్ 2 ధరను రూ.70వేల నుంచి రూ.58,999 తగ్గించినట్టు కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. తన 2018 మొబైల్ బొనాంజ సేల్‌లో వీటిపై డిస్కౌంట్లను ఆఫర్చేస్తుంది. రేపటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాబోతుంది. ఫ్లిప్‌కార్ట్ అప్‌కమింగ్ ఆఫర్లలో గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు 13,001 రూపాయలు, 8,001 రూపాయలు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వాడి కొనుగోలు చేసే వారికి పిక్సెల్ 2పై రూ.8000 తగ్గింపు ఉంది. 64జీబీ స్టోరేజ్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ రూ.39,999కు అందుబాటులో ఉంటుండగా.. అతిపెద్ద పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.52,999కు లభ్యమవుతుంది. -
గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వైపు గ్రేట్ ఇండియన్ సేల్‌తో అదరగొడుతున్న అమెజాన్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.50వేల కంటే తక్కువనే ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్‌పై రూ.26,001 డిస్కౌంట్‌ను ప్రకటించిన అమెజాన్, రూ.49,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా 32జీబీ స్టోరేజ్ ఆప్షన్ వేరియంట్‌పై రూ.23వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోన్ కూడా అమెజాన్‌లో రూ.44వేలకు అందుబాటులోకి వచ్చింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్పై అదనంగా 3000 రూపాయల తగ్గింపును ఈ వెబ్సైట్ ఆఫర్ చేస్తోంది. నెలవారీ ఈఎంఐలను కూడా ఈ ఫోన్‌పై రూ.2,377 నుంచి ప్రారంభించింది. గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్లు గూగుల్ సొంత బ్రాండులో వచ్చిన తొలి స్మార్ట్ఫోన్లు. హెచ్‌టీసీ ఈ స్మార్ట్ఫోన్లను తయారుచేసింది. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.76వేలు కాగ, 32జీబీ వేరియంట్ ధర రూ.67వేలు. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ఫీచర్లు... 5.5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే 1.6గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు 3450 ఎంఏహెచ్ లిథియం-మెటల్ బ్యాటరీ 12.3 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా గూగుల్ ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డివైజ్‌కు ఏడాది పాటు మానుఫ్రాక్ట్ర్చరర్ వారెంటీని అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇన్-బాక్స్ యాక్ససరీస్‌కు ఆరు నెలల వారెంటీ ఇస్తోంది. -
ఎలాకొన్నా ఆ ఫోన్లపై 13వేల క్యాష్ బ్యాక్
కస్టమర్లను ఆకట్టుకోవడానికి గత రెండేళ్లుగా కంపెనీలు ఇస్తున్న భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాంకు ఆఫర్ల ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ముందస్తు వాటికి కంటే కాస్త విభిన్నంగా గూగుల్ తన ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించినట్టు తెలిసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదా నగదుతో ఎలా కొనుగోలు చేసిన తమ గూగుల్ తన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్లపై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ లైన్ రిటైలర్స్ వద్ద కూడా ఈ ఫోన్లు 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో అందుబాటులో ఉన్నాయని రిపోర్టులు తెలిపాయి. కొనుగోలు చేసిన తక్షణమే ఈ క్యాష్ బ్యాక్ ను కంపెనీ ఆఫర్ చేయనుందట. డెబిట్ కార్డుల ద్వారా చేపడుతున్న ఈఎంఐ కొనుగోళ్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుందని తెలుస్తోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లపై 13వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ మే 31 వరకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం క్యాష్ బ్యాక్ వర్తించే బ్యాంకు వివరాలు.. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్, యస్ బ్యాంకు, యూబీఐలు. గూగుల్ పిక్సెల్ 32జీబీ, 128 స్టోరేజ్ ఆప్షన్స్ కలిగిన వేరియంట్ ధరలు 57వేల రూపాయలు, 66వేల రూపాయలుగా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ వేరియంట్ ధర 67వేల రూపాయలు కాగ, 128జీబీ వేరియంట్ ధర 76వేల రూపాయలు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో గూగుల్ పిక్సెల్ 32జీబీ వేరియంట్ ధర 44వేల రూపాయలకు దిగొచ్చింది. 128జీబీ వేరియంట్ ధర 53వేల రూపాయలుగా ఉంది. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రస్తుతం 54వేల రూపాయలకే అందుబాటులో ఉంది. 128జీబీ వేరియంట్ ను 63వేల రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు.