గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్
ముంబై: ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ గూగుల్ పిక్సెల్ , గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లపై భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది. కొత్త పిక్సెల్ స్మార్ట్ఫోన్‌పై మొత్తం రూ.29వేల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ.57 వేలు ఉన్న 32 జీబీ వేరియంట్ పై రూ.9 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అలాగే పాత స్మార్ట్ ఫోన్ మార్పిడి ద్వారా రూ.20వేల దాకా డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. ఇలా మొత్తం భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎక్స్ఛేంజి ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
రూ.66 వేల 128జీబీ గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను రూ. 37,000 లకే విక్రయిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం రాయితీ. అయితే గరిష్ట డిస్కౌంట్ రూ.200 గా ఉంది. రిలయన్స్ డిజిటల్, క్రోమాలాంటి రీటైలర్స్ లో కూడా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ అందుబాటులోఉంది.
క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వారికి రూ.9 వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్ ఆ మొత్తం జూన్ 5, 2017తరువాత మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. ఎక్స్ఛేంజి ద్వారా కొనుగులు చేసే వారికి ఫోన్‌ను బట్టి రూ.20,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు పేర్కొంది.
5.5 ఇంచెస్, 2560x1440 రిజల్యూషన్, 5 అంగుళాల(1920x1080రిజల్యూషన్) డబుల్ స్క్రీన్ వేరియంట్, 32జీబీ, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో బ్లాక్ అండ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు గతేడాది అక్టోబరులోనే భారత మార్కెట్లోకి వచ్చాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్, 12.3-మెగాపిక్సెల్ వెనుక కెమెరా , 2,770 ఎమ్ఏహెచ్ , 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్స్ వీటిల్లో ఉన్నాయి.
మరిన్ని వివరాలకోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ ను పరిశీలించగలరు.