ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్డీల్ బ్రిలియంట్ ఆఫర్ | Google Pixel, Pixel XL now selling on Snapdeal, Rs 10,000 cashback on offer | Sakshi
Sakshi News home page

ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్డీల్ బ్రిలియంట్ ఆఫర్

Published Tue, Jan 17 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

ఆ స్మార్ట్ఫోన్లపై  స్నాప్డీల్  బ్రిలియంట్ ఆఫర్

ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్డీల్ బ్రిలియంట్ ఆఫర్

ముంబై: ప్రముఖ  ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ సోమవారం భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇ-కామర్స్  సైట్   యాత్ర , ఎస్ బ్యాంక్  ఈ-క్యాష్ ద్వారా  రూ. 10,000  తక్షణ  క్యాష్ బ్యాక్,  అలియాంజ్ నుంచి  రెండు స్మార్ట్ ఫోన్లకు  మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ను  రూ. 5999ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది.   ఈ మేరకు గూగుల్ పిక్సెల్ తో ఆన్ లైన్   రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ రావడం ఆనందంగా ఉందని  స్నాప్డీల్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ చడ్డా చెప్పారు.  ఇప్పటికే నాణ్యతలో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ స్మార్ట్ ఫోన్లు  తమ తాజా ఆఫర్  ద్వారా  హాట్ సెల్లర్ గా నిలవనున్నాయనే  విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
 
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో  గూగుల్ పిక్సెల్ 128జీబీ రూ.66 వేలకు, 32 జీబీ రూ.57వేలకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ( బ్లాక్ అండ్ సిల్వర్, 32 జీబీ) రూ.67 వేలకు  లభిస్తోంది.  ఫ్లిప్ కార్ట్ లో ఎక్సేంజ్ ఆఫర్ లో రూ 23 వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే   ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈఎంఐ లపై  రూ 8000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై  అదనంగా 5 శాతం  తగ్గింపు .
కాగా గూగుల్ పిక్సెల్ , ఎక్స్ఎల్ అధికారికంగా అక్టోబర్ 4న లాంచ్ అయ్యాయి. 64 గంటల బ్యాటరీ లైఫ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 1080x 1920 పిక్సెల్ రిజల్యూషన్ తదితర ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గూగుల్‌ అసిస్టెంట్‌, వర్చువల్‌ రియాలిటీ సామర్థ్యం, 32-128 జీబీ మెమొరీ, 12.3-8 మెగాపిక్సెల్‌ కెమేరాలు, 5.5 అంగుళాల తెర, 4జీబీ ర్యామ్‌, 3,450 ఏంఏహెచ్‌ బ్యాటరీ , ఆండ్రాయిడ్‌ 7.1 నాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో 'పిక్సెల్' స్మార్ట్ ఫోన్లను ఆవిష్కారంతో  గూగుల్ స్మార్ట్ ఫోన్ల రంగంలో పోటీకి  తొలి అడుగువేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement