ఈ ఏడాది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏదో తెలుసా? | this year best smartphone | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏదో తెలుసా?

Published Mon, Dec 26 2016 3:44 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

this year best smartphone



2016 త్వరలోనే బైబై చెప్పి వెళ్లిపోబోతున్నది. కొత్త సంవత్సరం రాబోతున్నది. మరి, 2016లో వచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏది? ఏ ఫోన్‌ ఎక్కువగా యూజర్ల మనస్సును గెలుచుకుంది? స్పెషికేషన్స్‌ పరంగా ఏ స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది విజేతగా నిలిచిందంటే..

ఈ నిజానికి ఈ ఏడాది డిజైన్‌పరంగా స్మార్ట్‌ఫోన్లలో గొప్ప మార్పులేమీ రాలేదు. కానీ అన్ని స్థాయిల ధరలలోనూ బెస్ట్ ఫీచర్స్‌ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25వేలకుపైగా ధరతో భారీ ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌గా వెలువడిన స్మార్ట్‌ఫోన్ల వరకు చూసుకుంటే.. ఈ ఏడాది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ల గురించి నిపుణుల చెప్తున్న అభిప్రాయమిది.

ఈ ఏడాది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ విన్నర్‌: ఐఫోన్ 7 ప్లస్‌
2016లో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో పర్ఫామెన్స్‌ పరంగా చూసుకుంటే.. ఈ ఏడాది విజేత ఐఫోన్‌ 7 ప్లస్సే. డిజైన్‌పరంగా పెద్దగా మార్పులు చేయకపోయినా.. అంతర్జాతీయస్థాయి పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ స్థాయి పర్ఫార్మెన్స్‌ అందించడంలో ఈ ఫోన్‌ టాప్‌ స్థానంలో నిలిచింది. ఫ్లాగ్‌షిప్‌ స్థాయిలో రానున్న రెండేళ్లు నిలకడగా సేవలు అందించే ఫోన్‌ మీకు కావాలంటే.. మీరు దీనిని ఎంచుకోవచ్చు. ఈసారి నీళ్లు, దుమ్ము పడకుండా రెసిస్టెంట్‌ డిజైన్‌తో రావడం మరో అడ్వాంటేజి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఐఫోన్‌-7 ప్లస్‌ ఈసారి డుయల్‌ ఫ్రంట్‌ కెమెరాతో రావడం మరో విశేషం. వైడ్‌ యాంగిల్‌, టెలిఫొటో లెన్స్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'బోకే స్టైల్‌' ఎఫెక్ట్‌.. ఐఫోన్‌ 7 ప్లస్‌ యూజర్లకు అంతర్జాతీయస్థాయి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తోంది.  2X ఆప్టికల్‌ జూమ్‌, 10x  డిజిటల్‌ జూమ్‌ ఉండటం ఈ ఫోన్‌లోని కెమెరాలో మరో స్పెషాలిటీ.

రన్నరప్‌: సాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 7 ఎడ్జ్‌
టెక్నాలజీ దిగ్గజం సాంసంగ్‌ ఈ ఏడాది గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌తో మళ్లీ లాభాలబాట పట్టింది. గ్లాస్‌, మెటల్‌ డిజైన్‌తో, కర్వ్‌డ్‌ అంచులతో ఈ ప్రీమియర్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. పర్ఫార్మెన్స్‌ విషయంలోనూ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ బాగుంది. అయితే, ఐఫోన్‌ 7 ప్లస్‌ను మాత్రం ఢీకొనలేకపోయింది. సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ ఉండటం ఈ ఫోన్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ఏకంగా 12 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఏడాది గెలాక్సీ నోట్‌ 7 బ్యాటరీ పేలుళ్ల వివాదం సాంసంగ్‌ను తీవ్రంగా ఒడిదుడుకుల్లో నెట్టినా.. గెలాక్సీ ఎస్‌ 7 ఎడ్జ్‌ ఆ సంక్షోభం నుంచి కొంతమేర నిలబెట్టగలిగింది. గూగుల్‌ పిక్సెల్‌ కన్నా చాలా స్టేబుల్‌గా ఉండటం వల్ల దీనికి రన్నరప్‌ స్థానం ఇవ్వవచ్చునని నిపుణులు అంటున్నారు.

బెస్ట్‌ అండ్రాయిడ్‌ ఫోన్‌: గూగుల్‌ పిక్సెల్‌
ఈ ఏడాది గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో అడుగుపెట్టింది. గత అక్టోబర్‌ నెలలో ప్రీమియం ధరలతో పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ సిరీస్‌ ఫోన్లను విడుదల చేయడం ద్వారా ఈ రంగంలో సాంసంగ్‌, యాపిల్‌ టాప్‌ బ్రాండ్‌ ఫోన్లకు సవాలు విసిరింది.

బెస్ట్‌ గూగుల్‌ ఫీచర్లు పొందాలంటే ఈ ఫోన్లు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ఫోన్ల కోసమే గూగూల్‌ అసిస్టెంట్‌ ఫిచర్‌ను కంపెనీ తీసుకురావడం గమనార్హం. అత్యాధునిక్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సుపీరియర్‌ కెమెరాతోపాటు ఐఫోన్‌ సహా అన్ని ఫోన్ల నుంచి నేరుగా మొత్తం డాటాను బదిలీచేసుకునే వీలు కల్పిస్తూ ఈ పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ మార్కెట్‌లోకి వచ్చాయి.

ఐఫోన్‌ ఎస్‌ సిరీస్‌కు, సాంసంగ్‌ ఎస్‌ 7 ఎడ్జ్‌కు సరితూగేరీతిలో ఈ ఫోన్లలో కెమెరా డిపార్ట్‌మెంట్‌ ఉండటం మరో హైలెట్‌. ఔట్‌డోర్‌లో అయినా, లో లైటింగ్‌ సెట్టింగ్‌లో అద్భుతమైన షాట్స్‌ తీసుకునే సదుపాయాన్ని ఈ ఫోన్‌ కల్పిస్తోంది. డిజైన్‌పరంగా పెద్దగా ప్రత్యేకత లేకపోయినా ఈ ఏడాది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో దీనికి పెద్దపీట వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రన్నరప్‌: వన్ ప్లస్‌ 3
ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌లకు దీటుగా టాప్‌ పర్ఫార్మెన్స్‌తో అందుబాటు ధరలతో మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌ వన్ ప్లస్‌ 3.  ధరపరంగా (ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్ల ధరలో సగం ధరకే లభిస్తోంది), ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌ పరంగా చూసుకుంటే.. వన్ ప్లస్‌ 3యే విన్నర్‌ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో కెమెరా, ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌, బ్యాటరీ లైఫ్‌ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఐఫోన్‌, గెలాక్సీ ఎస్‌ 7 ఎడ్జ్‌ స్థాయి ఫీచర్లతో తక్కువ ధరకు ఫోన్‌ కావాలంటే తప్పక దీనివైపు మొగ్గుచూపవచ్చు. అయితే, వన్‌ ప్లస్‌ 3, 3టీ రెండు సిమిలర్‌గా కనిపిస్తున్నా.. ఒకటి కాదు. ఇటీవల భారత్‌లో విడుదలైన వన్‌ ప్లస్‌ 3నే చాలావరకు ఉత్తమంగా  ఉంది.

ప్రత్యేక ప్రస్తావన
మోటో జడ్‌!
మాడ్యులర్‌ డిజైన్‌తో, ఎక్స్‌ట్రా స్లిమ్‌ ఫ్యాక్టర్‌తో వచ్చిన మోటో జడ్‌ ఫోన్‌ను ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. ఎక్స్‌ ట్రా బ్యాటరీ, హజెల్‌బ్లాడ్‌ జూమ్‌ లెన్స్‌, ప్రోజెక్టర్‌, జేబీఎల్‌ స్పీకర్‌ వంటి పలు సృజనాత్మకమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో లభిస్తున్న ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌ ఫోన్లను బట్టి చూస్తే దీని ధర కొంచెం తక్కువేనని చెప్పవచ్చు.

నుబియా జెడ్‌11

30వేల ధరలో లభించే ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌ ఫోన్లలో వన్‌ ప్లస్‌ 3 తర్వాత అంతే చెప్పుకోదగిని ఫోన్‌ ఇదే. ఈ నెలలోనే విడుదలైన ఈ ఫోన్‌ పర్ఫార్మెన్స్‌ పరంగా ఆకట్టుకుంటోంది. చక్కని డిజైన్‌, మంచి కెమెరా వంటి ఫీచర్లతో మధ్యతరహా ధరలతో లభిస్తున్న న్యూబియా జెడ్‌11 దేశంలో బ్రాండ్‌ గా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement