ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా? | 27% off on Apple iPhone 7, Google Pixel sees price drop of 13K: Flipkart's Day 2 Sale | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా?

May 15 2017 10:50 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా? - Sakshi

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా?

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది. ఒకవేళ 128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.
 
మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం  12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీని ధర 49,900 రూపాయల నుంచి 27,999 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా ఎల్జీ 108 సీఎం ఫుడ్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర కూడా 14,901 రూపాయలు తగ్గించింది. బడ్జెట్ రేంజ్ స్మార్ ఫోన్లపై కూడా 7,999 రూపాయల వరకు ఫ్లిప్ కార్ట్ తగ్గింపును ప్రకటించింది. వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై కూడా ఈ ఈటైలర్ బ్లాక్ బస్టర్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement