Apple iPhone 7
-
ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా?
ఫ్లిప్ కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది. ఒకవేళ 128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీని ధర 49,900 రూపాయల నుంచి 27,999 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా ఎల్జీ 108 సీఎం ఫుడ్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర కూడా 14,901 రూపాయలు తగ్గించింది. బడ్జెట్ రేంజ్ స్మార్ ఫోన్లపై కూడా 7,999 రూపాయల వరకు ఫ్లిప్ కార్ట్ తగ్గింపును ప్రకటించింది. వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై కూడా ఈ ఈటైలర్ బ్లాక్ బస్టర్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఐఫోన్లో మిస్సైన ఆరు గెలాక్సీ ఫీచర్లివే!
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఆపిల్ ఐఫోన్లకు కిల్లర్‌గా శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన తన లేటెస్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్ లో లాంచ్ చేసి, వాటి ధరలు 57,900 రూపాయలుగా, 64,900 రూపాయలుగా ప్రకటించింది. హైఎండ్ ఫీచర్లను ఆఫర్ చేసే ఆపిల్ కు ధీటుగా.. అద్భుతమైన ఫీచర్లతో వీటికి కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ లేటెస్ట్ ఫోన్లలో ఆఫర్ చేసే ఆరు ఫీచర్లు మనం ఐఫోన్లలో కనివినీ ఎరుగమట. ఐఫోన్లో మిస్సైన ఆరు శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫీచర్లేమిటో ఓ సారి చూద్దాం... 'ఇన్ఫినిటీ డిస్ప్లే' విత్ కర్వ్డ్ డిజైన్ శాంసంగ్ తన లేటెస్ట్ గెలాక్సీ ఫోన్లలో కొత్త డిస్ప్లేను ప్రవేశపెట్టింది. ఇన్ఫినిటీ డిస్ప్లేను ఈ ఫోన్లకు అమర్చింది. క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ప్యానల్స్ ను ఈ ఫోన్లలో కంపెనీ వాడింది. కార్నింగ్ గొర్రిలా గ్లాస్ 5 ఈ స్క్రీన్‌ను ఎప్పడికప్పుడూ సురక్షిస్తూ ఉంచుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ల 'స్క్రీన్ టూ బాడీ' రేషియో 83.6 శాతం ఉండగా.. ఐఫోన్ 7కు అది 65.6 శాతమే ఉంటుంది. ఫేసియల్ రికగ్నైజేషన్ శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఫోన్లలో మరో కీలక ఫీచర్ ఫేసియల్ రికగ్నైజేషన్. ఈ ఫీచర్ ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల భద్రతా ఫీచర్లలో అదనపు సెక్యురిటీగా ఉపయోగపడుతోంది. గిగాబిట్ ఎల్టీఈ సపోర్టు గిగాబిట్ ఎల్టీఈ సపోర్టు(1000ఎంబీపీఎస్ వరకు)తో వచ్చిన ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్స్ ఎస్16 ఎల్టీఈ మోడమ్ ఈ హైస్పీడ్‌ను అందిస్తోంది. ఐఫోన్ 7, 7ప్లస్‌లు కేవలం 450ఎంబీపీఎస్ సపోర్టు మాత్రమే కలిగి ఉన్నాయి. బ్లూటూత్ వీ5.0 కొత్త టెక్నాలజీని వాడుతూ శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్ వీ5.0 ఫీచర్‌ను మొదటిసారి అందించింది. ఈ టెక్నాలజీతో రెండు వైర్లెస్ హెడ్ఫోన్లను ఒకేసారి వాడుకునే అవకాశముంటోంది. ముందటి వెర్షన్ల కంటే ఈ బ్లూటూత్ వీ5.0 చాలా వేగంగా, లాంగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ ఫోన్ నుంచి అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్లకు తీసుకొచ్చింది. కానీ ఇప్పటివరకు ఐఫోన్లకు ఆపిల్ ఆ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాలేదు. కొత్త 10ఎంఎం ప్రాసెసర్ శాంసంగ్ కొత్త ఫోన్లలో ఉన్న క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835, కంపెనీ సొంత ఎక్సీనోస్ 8895 లు ప్రపంచంలోనే తొలి 10 ఎన్ఎం ప్రాసెసర్స్. ఈ ఎస్ఓసీలు కంపెనీ ఫోన్లకు మెరుగైన ప్రదర్శనను అందించనున్నాయి. -
ఐఫోన్ మళ్లీ పేలింది!
సిడ్నీ: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు తరచుగాగా చోటు చేసుకోవడంతో ఆ కంపెనీ గత త్రైమాసికంలో ఆ కంపెనీ మార్కెట్ పై ప్రభావం చూపింది. శాంసంగ్ నుంచి పోటీ తగ్గుతుందని యాపిల్ సంబరపడింది. కానీ ప్రస్తుతం యాపిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా దిగ్గజ కంపెనీ యాపిల్ ఐఫోన్లు పేలుతుండటం ఆ కంపెనీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ఓసారి ఐఫోన్ 6, మరోసారి ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ స్మార్ట్ ఫోన్ పేలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 7 పేలిపోయి ఓ కారులోని వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వెల్స్ లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తన పేరు మాట్ జోన్స్ అని తాను సర్ఫింగ్ కు వెళ్లగా తన ఐఫోన్ పేలిపోయిందని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. తాను సర్ఫింగ్ కు వెళ్తూ ఐఫోన్ 7ను కారులో వదిలివెళ్లానని, తిరిగొచ్చి చూసే సరికి కారు నిండా దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పాడు. కేవలం వారం కిందటే ఐఫోన్ తాను కొనుగోలు చేయగా.. అంతలోనే ఫోన్ పేలిపోయిందన్నాడు. తాను కేవలం కంపెనీ ఇచ్చిన ఛార్జర్ మాత్రమే వాడినట్లు తెలిపాడు. బ్యాటరీల తయారీలో లిథియం-అయాన్ వాడుతున్న స్టార్ట్ ఫోన్ల లోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పేలుడుకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టామని గతంలో ఐఫోన్లు పేలిన సందర్భంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆగస్టులోనే ఐఫోన్ తొలిసారిగా పేలినా.. రెండు నెలల తర్వాత కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల కిందట ఐఫోన్ 6 పేలి ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సిడ్నీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో అతడికి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. (తప్పక చదవండీ: స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?) -
డెలివరీ బాయ్‌గా బడా బిజినెస్‌మేన్
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విడుదలై నేడు భారత్ లో సరిగ్గా రాత్రి 7గంటల ప్రాంతలో అడుగుపెట్టనున్న ఆపిల్ ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్ల డెలివరీ కోసం ఒక కొత్త డెలివరీ బాయ్ బయలు దేరారు. అది కూడా సామాన్యమైన వ్యక్తి కాదండోయ్.. పెద్ద సెలెబ్రిటీ బిజినెస్‌మేన్ ఆయన. ఫ్లిఫ్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ ఏకంగా నేడు డెలివరీ బాయ్‌గా అవతారం ఎత్తనున్నారు. తాజాగా భారత్ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ ఫోన్లు ఇప్పటికే ఆర్డర్లు చేసిన వాళ్లలో కొంతమందికి ఆయనే స్వయంగా డెలివరీ బాయ్‌గా వెళ్లి ఈ ఫోన్లు అందించనున్నారు. బెంగళూరులో అమ్మకాలు ప్రారంభమైన 7గంటల తర్వాత బన్సల్ డెలివరీ బాయ్ గా మారి కొన్ని ఫోన్లు చేరవేస్తారని ఆ కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఫోన్ల అమ్మకాలు ప్రారంభమైన మరుక్షణమే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తగిన సమయంలో ఐఫోన్లను అందించేందుకు మొత్తం సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ఈ కొత్త ఐఫోన్లపై ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఐఫోన్7 ఈఎంఐ ఆప్షన్ రూ.2,910 నుంచి ప్రారంభమవుతుంది. డెలివరీ బాయ్ -
ఐఫోన్ 7 భారత్‌కి ఎప్పుడొస్తుందో తెలుసా?
శానిఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియం వేదికగా అట్టహాసంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్‌లు త్వరలోనే భారత్‌లోకి ప్రవేశించనున్నాయట. అక్టోబర్ 7 నుంచి ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ అమ్మకాలను భారత్‌లో చేపడతామని యాపిల్ ప్రకటించింది. మిగతా ఐఫోన్ల కంటే చౌకైన ధరలోనే ఈ ఫోన్లు భారత్‌లో లభ్యంకానున్నట్టు తెలిపింది. ధర రూ.60,000(32జీబీ మోడల్) నుంచి ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. సిల్వర్, రోజ్ గోల్డ్ , బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో 32జీబీ, 128జీబీ, 256 జీబీ వేరియంట్లలో ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్‌లు అందుబాటులోకి వచ్చాయి. రెండో బ్యాచ్ కింద భారత్‌లో ఈ విక్రయాలు చేపడతామని యాపిల్ మీడియా ప్రకటన ద్వారా నిర్ధారించింది. అయితే మున్నుపెన్నడూ లేనివిధంగా ఆవిష్కరించిన వేడుకలోనే భారత్‌లో ఈ ఫోన్ల విక్రయ ప్రారంభం, ధరల వివరాలను యాపిల్ ప్రకటించడం విశేషం. అవసరమైన ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా ఐఫోన్7 లాంచ్ ఈవెంట్ వేదికనే అన్ని విషయాలు యాపిల్ వెల్లడించేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో తన ప్రాబల్యం తగ్గడంతో, స్మార్ట్ఫోన్ల మార్కెట్‌కు, ఐఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తున్న భారత్‌పైన యాపిల్ ఎక్కువగా దృష్టిసారించింది. ఓ వైపు యాపిల్‌కు పోటీ కంపెనీ, స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 నెలముందే లాంచ్ చేసింది. కానీ బ్యాటరీ సమస్యలతో ప్రస్తుతం ఆ ఫోన్ విక్రయాలు నిలిపివేసింది. దీని క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్7 సిరీస్ అమ్మకాలను యాపిల్ త్వరలోనే భారత్‌లో చేపట్టనుంది. సెప్టెంబర్ 16 నుంచి అమెరికాలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 9నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టనుంది.