ఐఫోన్లో మిస్సైన ఆరు గెలాక్సీ ఫీచర్లివే!
ఐఫోన్లో మిస్సైన ఆరు గెలాక్సీ ఫీచర్లివే!
Published Thu, Apr 20 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఆపిల్ ఐఫోన్లకు కిల్లర్గా శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన తన లేటెస్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్ లో లాంచ్ చేసి, వాటి ధరలు 57,900 రూపాయలుగా, 64,900 రూపాయలుగా ప్రకటించింది. హైఎండ్ ఫీచర్లను ఆఫర్ చేసే ఆపిల్ కు ధీటుగా.. అద్భుతమైన ఫీచర్లతో వీటికి కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ లేటెస్ట్ ఫోన్లలో ఆఫర్ చేసే ఆరు ఫీచర్లు మనం ఐఫోన్లలో కనివినీ ఎరుగమట. ఐఫోన్లో మిస్సైన ఆరు శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫీచర్లేమిటో ఓ సారి చూద్దాం...
'ఇన్ఫినిటీ డిస్ప్లే' విత్ కర్వ్డ్ డిజైన్
శాంసంగ్ తన లేటెస్ట్ గెలాక్సీ ఫోన్లలో కొత్త డిస్ప్లేను ప్రవేశపెట్టింది. ఇన్ఫినిటీ డిస్ప్లేను ఈ ఫోన్లకు అమర్చింది. క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ప్యానల్స్ ను ఈ ఫోన్లలో కంపెనీ వాడింది. కార్నింగ్ గొర్రిలా గ్లాస్ 5 ఈ స్క్రీన్ను ఎప్పడికప్పుడూ సురక్షిస్తూ ఉంచుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ల 'స్క్రీన్ టూ బాడీ' రేషియో 83.6 శాతం ఉండగా.. ఐఫోన్ 7కు అది 65.6 శాతమే ఉంటుంది.
ఫేసియల్ రికగ్నైజేషన్
శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఫోన్లలో మరో కీలక ఫీచర్ ఫేసియల్ రికగ్నైజేషన్. ఈ ఫీచర్ ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల భద్రతా ఫీచర్లలో అదనపు సెక్యురిటీగా ఉపయోగపడుతోంది.
గిగాబిట్ ఎల్టీఈ సపోర్టు
గిగాబిట్ ఎల్టీఈ సపోర్టు(1000ఎంబీపీఎస్ వరకు)తో వచ్చిన ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్లు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్స్ ఎస్16 ఎల్టీఈ మోడమ్ ఈ హైస్పీడ్ను అందిస్తోంది. ఐఫోన్ 7, 7ప్లస్లు కేవలం 450ఎంబీపీఎస్ సపోర్టు మాత్రమే కలిగి ఉన్నాయి.
బ్లూటూత్ వీ5.0
కొత్త టెక్నాలజీని వాడుతూ శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్ వీ5.0 ఫీచర్ను మొదటిసారి అందించింది. ఈ టెక్నాలజీతో రెండు వైర్లెస్ హెడ్ఫోన్లను ఒకేసారి వాడుకునే అవకాశముంటోంది. ముందటి వెర్షన్ల కంటే ఈ బ్లూటూత్ వీ5.0 చాలా వేగంగా, లాంగ్ రేంజ్ను ఆఫర్ చేస్తోంది.
వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ ఫోన్ నుంచి అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్లకు తీసుకొచ్చింది. కానీ ఇప్పటివరకు ఐఫోన్లకు ఆపిల్ ఆ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాలేదు.
కొత్త 10ఎంఎం ప్రాసెసర్
శాంసంగ్ కొత్త ఫోన్లలో ఉన్న క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835, కంపెనీ సొంత ఎక్సీనోస్ 8895 లు ప్రపంచంలోనే తొలి 10 ఎన్ఎం ప్రాసెసర్స్. ఈ ఎస్ఓసీలు కంపెనీ ఫోన్లకు మెరుగైన ప్రదర్శనను అందించనున్నాయి.
Advertisement