ఐఫోన్ 7 భారత్కి ఎప్పుడొస్తుందో తెలుసా?
ఐఫోన్ 7 భారత్కి ఎప్పుడొస్తుందో తెలుసా?
Published Thu, Sep 8 2016 9:02 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
శానిఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియం వేదికగా అట్టహాసంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లు త్వరలోనే భారత్లోకి ప్రవేశించనున్నాయట. అక్టోబర్ 7 నుంచి ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ అమ్మకాలను భారత్లో చేపడతామని యాపిల్ ప్రకటించింది. మిగతా ఐఫోన్ల కంటే చౌకైన ధరలోనే ఈ ఫోన్లు భారత్లో లభ్యంకానున్నట్టు తెలిపింది. ధర రూ.60,000(32జీబీ మోడల్) నుంచి ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. సిల్వర్, రోజ్ గోల్డ్ , బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో 32జీబీ, 128జీబీ, 256 జీబీ వేరియంట్లలో ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్లు అందుబాటులోకి వచ్చాయి. రెండో బ్యాచ్ కింద భారత్లో ఈ విక్రయాలు చేపడతామని యాపిల్ మీడియా ప్రకటన ద్వారా నిర్ధారించింది.
అయితే మున్నుపెన్నడూ లేనివిధంగా ఆవిష్కరించిన వేడుకలోనే భారత్లో ఈ ఫోన్ల విక్రయ ప్రారంభం, ధరల వివరాలను యాపిల్ ప్రకటించడం విశేషం. అవసరమైన ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా ఐఫోన్7 లాంచ్ ఈవెంట్ వేదికనే అన్ని విషయాలు యాపిల్ వెల్లడించేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో తన ప్రాబల్యం తగ్గడంతో, స్మార్ట్ఫోన్ల మార్కెట్కు, ఐఫోన్లకు అతిపెద్ద మార్కెట్గా నిలుస్తున్న భారత్పైన యాపిల్ ఎక్కువగా దృష్టిసారించింది. ఓ వైపు యాపిల్కు పోటీ కంపెనీ, స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 నెలముందే లాంచ్ చేసింది. కానీ బ్యాటరీ సమస్యలతో ప్రస్తుతం ఆ ఫోన్ విక్రయాలు నిలిపివేసింది. దీని క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్7 సిరీస్ అమ్మకాలను యాపిల్ త్వరలోనే భారత్లో చేపట్టనుంది. సెప్టెంబర్ 16 నుంచి అమెరికాలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 9నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టనుంది.
Advertisement
Advertisement