డెలివరీ బాయ్గా బడా బిజినెస్మేన్ | Flipkart CEO Binny Bansal becomes 'delivery boy' for iPhone 7 | Sakshi
Sakshi News home page

డెలివరీ బాయ్గా బడా బిజినెస్మేన్

Published Fri, Oct 7 2016 6:24 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

డెలివరీ బాయ్గా బడా బిజినెస్మేన్ - Sakshi

డెలివరీ బాయ్గా బడా బిజినెస్మేన్

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విడుదలై నేడు భారత్ లో సరిగ్గా రాత్రి 7గంటల ప్రాంతలో అడుగుపెట్టనున్న ఆపిల్ ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్ల డెలివరీ కోసం ఒక కొత్త డెలివరీ బాయ్ బయలు దేరారు. అది కూడా సామాన్యమైన వ్యక్తి కాదండోయ్.. పెద్ద సెలెబ్రిటీ బిజినెస్మేన్ ఆయన. ఫ్లిఫ్కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ ఏకంగా నేడు డెలివరీ బాయ్గా అవతారం ఎత్తనున్నారు. తాజాగా భారత్ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ ఫోన్లు ఇప్పటికే ఆర్డర్లు చేసిన వాళ్లలో కొంతమందికి ఆయనే స్వయంగా డెలివరీ బాయ్గా వెళ్లి ఈ ఫోన్లు అందించనున్నారు.

బెంగళూరులో అమ్మకాలు ప్రారంభమైన 7గంటల తర్వాత బన్సల్ డెలివరీ బాయ్ గా మారి కొన్ని ఫోన్లు చేరవేస్తారని ఆ కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఫోన్ల అమ్మకాలు ప్రారంభమైన మరుక్షణమే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తగిన సమయంలో ఐఫోన్లను అందించేందుకు మొత్తం సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫ్లిప్కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫ్లిప్కార్ట్ ఈ కొత్త ఐఫోన్లపై ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఐఫోన్7 ఈఎంఐ ఆప్షన్ రూ.2,910 నుంచి ప్రారంభమవుతుంది.

డెలివరీ బాయ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement