Amazon OTT Gives Big Offer To RRR Movie Team: అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల వాయిదా వేసి తీవ్ర నిరాశకు గురి చేసింది చిత్రబృందం. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్ వల్ల సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకే జక్కన్న టీం మొగ్గు చూపింది. దీంతో అశేష ప్రేక్షకజనం అసహనం వ్యక్తం చేశారు. అందుకు కారణమైన మహమ్మారిని తిట్టుకుంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్‌ఆర్ఆర్ మేకర్స్‌తో అద్భుతమైన ఆఫర్ అందించింది.
అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకుపైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్‌టైనర్‌లను కొనుగోలు చేస్తుంది. అంటే పలు పెద్ద చిత్రాలను కొనుక్కొని పే-పర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. ఇలా యూఎస్‌ఏ సర్క్యూట్‌లో తరచుగా కొంటూ రిలీజ్ చేస్తుంది. కానీ భారతీయ మార్కెట్‌లో ఇలాంటి ప్రయోగం మాత్రం ఇప్పటివరకూ చేయలేదు అమెజాన్. అలాగే యూట్యూబ్‌లో కూడా కొన్ని సినిమాలను అద్దెకు చూడవలసి ఉంటుంది. అలాంటి సినిమాలను నిర్ణీత ధరతో ఒక రోజు కోసం అద్దెకు తీసుకుంటుంది. ఇలాంటి ఆఫర్‌ను ఆర్ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌కు అమెజాన్ ఇచ్చింది. దీని ద్వారా సులభంగా రూ. 200 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలిపిందట.
అయితే ఈ ఆఫర్‌ను ఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ ఒప్పుకోలేదు. థియేటర్ల ద్వారా వచ్చే కలెక్షన్లతో పోల్చితే ఈ ఆదాయం చాలా తక్కవ అని మేకర్స్ అభిప్రాయపడ్డారట. దీంతో ఈ ఆఫర్‌ను వారు తిరస్కరించారని సమాచారం. ఆర్ఆర్‌ఆర్ మూవీ బాక్సాఫీస్ నుంచి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అలా అయితేనే సినిమాకు పెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో తిరిగి పొందగులుగుతారు. ఇది సింగిల్ పేఅవుట్ మోడల్, పే-పర్-వాచ్ మోడల్ అయినప్పటికీ ఆర్ఆర్‌ఆర్ చిత్రం ఓటీటీకి సంబంధించిన ఎంపిక కాదని దర్శకనిర‍్మాతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సినిమాకు సుమారు రూ. 400 కోట్లు ఖర్చు అయినట్లు తెలిసిందే.
ఇదీ చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా.. ఫన్నీగా, బాధగా ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment