
పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. టాటా మోటార్స్ ఫిబ్రవరి నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను విడుదల చేసింది. Tiago , Tigor , Nexon , Harrier , Safari వంటి టాటా కార్లపై ఈ నెలలో కస్టమర్‌లు రూ. 40,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్‌ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి.
Tata Tiago,Tigor కార్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది . అయితే, ఈ ఆఫర్‌లు కొత్తగా ప్రవేశపెట్టిన టియాగో, టిగోర్ సీఎన్జీ మోడల్స్‌పై వర్తించవు. దాంతో పాటుగా రూరల్ డిస్కౌంట్ రూ. 2,500, కార్పొరేట్ ప్రయోజనంగా రూ. 3,000, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రూ. 3,000 డిస్కౌంట్‌ను టాటా మోటార్స్ అందిస్తోంది.
Nexon కాంపాక్ట్ SUVపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు, పెట్రోల్ ట్రిమ్స్‌పై కార్పొరేట్, హెల్త్ వర్కర్స్ స్కీమ్ కింద రూ.3,000 తగ్గింపు, డీజిల్ ట్రిమ్ రూ.5,000 తగ్గింపుతో లభిస్తుంది. డార్క్ ఎడిషన్ రేంజ్ మినహా మొత్తం నెక్సాన్ శ్రేణిలో కార్లకు ఈ ఆఫర్‌లు వర్తిస్తాయి.
టాటా హారియర్, సఫారీ కార్లపై రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తాయి . వీటికి అదనంగా గ్రామీణ తగ్గింపు, కార్పొరేట్ తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల స్కీమ్ రూ. 5,000 తగ్గింపును పొందుతుంది.
చదవండి: పవర్‌ఫుల్ ర్యామ్, 50 ఎంపీ కెమెరాతో వివో 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే..?