Flipkart Year End Sale: Apple AirPods Pro Available at Rs 1,490 - Sakshi
Sakshi News home page

ఇది కదా ఆఫర్‌ అంటే.. ఇలా చేస్తే, కేవలం రూ.1490లకే యాపిల్‌ ఎయిర్‌పొడ్స్‌!

Published Fri, Dec 30 2022 5:05 PM | Last Updated on Fri, Dec 30 2022 7:21 PM

Bumper Offer: Apple Airpods Pro Available For Rs 1490 On Flipkart On This Condition - Sakshi

యాపిల్‌ కంపెనీ.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మార్కెట్లో తన ప్రాడెక్ట్‌లకు ఓ బ్రాండ్‌ పేరుతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకుంది ఈ కంపెనీ. అందుకే యాపిల్‌ మార్కెట్లోకి విడుదల చేసే ఏ ప్రాడెక్ట్‌కైన విపరీతమైన డిమాండ్‌తో పాటు కాస్త ఖరీదుగా ఉంటాయి. అయితే యాపిల్‌ ఎయిర్‌పోడ్స్‌ ‌కొనాలని చూస్తున్న వారికి ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఇయర్ ఎండ్ సేల్’ రూపంలో అద్భుత అవకాశం అందిస్తోంది. తన కస్టమర్ల కోసం యాపిల్ ఎయిర్‌పోడ్స్‌ ప్రో (Apple AirPods pro) ని అద్భుతమైన ఆఫర్‌లో కేవలం రూ.1490 మీ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం!

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Apple AirPods pro ధర రూ. 20,990గా ఉంది. ఈ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ యాపిల్‌కు ఉన్న బ్రాండ్‌, ఈ ఇయర్‌పోడ్స్‌ సౌండ్‌ క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉండడంతో దీనికి క్రేజ్‌ విపరీతంగా ఉంటుంది. అందుకే వీటి కొనుగోలు మ్యూజిక్‌ లవర్స్‌ ఎగుబడుతుంటారు.

అయితే కొత్త సంవత్సరం సందర్భంగా బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. అదేంటంటే.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ పేమెంట్స్‌పై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ. 2000 తగ్గింపుతో మనకు రూ.18,990లకే లభిస్తుంది.

వీటితో పాటు అదనంగా, కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌చేంజ్‌ చేయడం ద్వారా రూ.17,500 వరకు అద్భుతమైన తగ్గింపు కూడా ఉంది. ఇంతటి భారీ తగ్గింపుతో అనంతరం మీరు ఈ ఇయర్‌పాడ్స్‌ని కేవలం రూ. 1,490కే కొనుగోలు చేయవచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా కస్టమర్ల ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ పరిమితం కాలం ఉంటుందని తెలుస్తోంది, కాబట్టి వెంటనే యాపిల్‌ ఇయర్‌పోడ్స్‌ని కొనుగోలు చేయాలనుకున్న వారు త్వరపడండి.

చదవండి: న్యూ ఇయర్‌ ఆఫర్‌: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement