సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ప్రయివేటు రంగవిమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రానున్న నెలలో చైనానుంచి వస్తున్న, లేదా చైనాకు వెళుతున్న ప్రయాణికులకు ఒక వెసులుబాటును ప్రకటించింది. ఈ ప్రయాణానాకి సంబంధించి ఇప్పటికే బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమాన టికెట్ల తేదీ మార్పును లేదా ఉచిత కాన్సిలేషన్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. జనవరి 24 - ఫిబ్రవరి 24 వరకు ప్రయాణించే అన్ని విమానాల్లో ఈ ఆఫర్‌ను అమలు చేయనున్నాయి. మాఫీ పెనాల్టీ ఛార్జీలపై మాత్రమే ఉంటుందని వివరించాయి. ఈ వివరాలను ఎయిరిండియా, ఇండిగో ట్విటర్ వేదికగా షేర్ చేశాయి.
ఇండిగో ప్రస్తుతం చైనాకు రెండు డైరెక్టు విమానాలను నడుపుతోంది, ఒకటి ఢిల్లీ-చెంగ్డు మార్గంలో, మరొకటి కోల్‌కతా-గ్వాంగ్‌జౌ మార్గంలో ఉంది. దీంతోపాటు మార్చి 15 నుండి ముంబై-చెంగ్డు మార్గంలో రోజువారీ విమాన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఎయిర్ ఇండియా ఢిల్లీ-షాంఘై మార్గంలో ఒక డైరెక్ట్ విమానాన్ని నడుపుతోంది. కాగా చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకారం, కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 26 మంది మరణించారు. ఇరవై తొమ్మిది ప్రావిన్సులలో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా హుబీ ప్రావిన్స్‌లో 880 కి పైగా కేసులు నమోదయ్యాయి. శరవేగంగా విస్తరిస్తున్న కరోనాను నిలువరించే చర్యల్లో భాగంగా 13 నగరాల మధ్య రాకపోకలను చైనా ప్రభుత్వం నిలిపివేయడంతో చైనాలో లునార్ నూతన సంవత్సర వేడుకలను భారీగా ప్రభావితం చేస్తోంది..
చదవండి : కేరళకు పాకిన కరోనా? ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు
#FlyAI : In view of #coronovirusoutbreak Reissue/ No-Show/Cancellation and Refund charges for all International tickets for Travel to/from China effective
24.01.2020 to 24.02.2020 is waived off. Waiver is ONLY on the penalty charges. Any fare difference will be
additional.
— Air India (@airindiain) January 24, 2020
#6ETravelAdvisory: Due to #CoronavirusOutbreak, we're offering change/cancellation fee waiver to passengers travelling to/from #China, effective 24th Jan to 24th Feb, 2020, fare difference if any will be applicable. For assistance contact us on Twitter/Facebook. pic.twitter.com/29HZCpvvEm
— IndiGo (@IndiGo6E) January 24, 2020
Comments
Please login to add a commentAdd a comment