Bigg Boss 4 Telugu Cotestant Divi Vadthya Got A Chance In Powen Kalyna, Rana Upcoming Movie | మల్టీ స్టారర్‌ మూవీలో దివికి ఛాన్స్‌ - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన దివి?

Published Tue, Jan 5 2021 1:16 PM | Last Updated on Tue, Jan 5 2021 8:31 PM

Buzz Created That Bigg Boss Fame  Divi Got A Offer In Pawan Kalyan Film - Sakshi

సొట్ట బుగ్గ‌ల సుందరి, బిగ్‌బాస్‌  కంటెస్టెంట్‌ దివి వైద్యకు ఓ క్రేజి ఆఫర్‌ వరించింది. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటితో కలిసి నటిస్తోన్న  మల్టీ స్టారర్‌ మూవీలో దివి ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ క్రేజీ  మల్టీ స్టారర్ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి అటు పవన్‌, ఇటు రానా అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. క్రేజీ  కిల్లర్ కాంబో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంత హైప్‌ ఉన్న ఈ సినిమాలో దివి​కి మంచి రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. (రానా మరో జర్నీ బిగిన్స్‌ : కిల్లర్‌ కాంబో )

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌బిస్‌ ఫినాలే రోజునే తన సినిమాలో నటించేందుకు దివికి అవకాశం ఇచ్చారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. తమిళ్‌లో అజిత్‌ హీరోగా సూపర్‌హిట్‌గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాకు  రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత సీజన్‌‌ కంటెస్టెంట్‌లతో పోలిస్తే బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు మంచి ఆఫర్లు వరిస్తున్నాయి. ఇప్పటికే సోహైల్‌, అభిజీత్‌, మోనాల్‌ చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు. (బాయ్‌ఫ్రెండ్‌, ప‌ల్లెటూరుకు ర‌మ్మ‌న్నాడు:‌ దివి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement