బిలియనీర్ ముఖేష్ అంబానీ రెండో ఏడాది సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోలేదని తెలుస్తోంది. కోవిడ్-19 సంక్షోభం బిజినెస్, ఎకానమీపై ప్రభావం చూపింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన రెమ్యునరేషన్ వదులుకున్నట్లు తెలుస్తోంది.
జులై 22న రిలయన్స్ క్యూ1 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. తాజాగా ముఖేష్ అంబానీ జీతం ఎంత తీసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసుకోలేదని రిలయన్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి దేశ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగంపై తీవ్ర నష్టాన్ని కలిగించింది. అందుకే ముఖేష్ అంబానీ 2020-21లో జీతం వద్దనుకున్నారని, అలాగే 2021-22లో సైతం ఎలాంటి రెమ్యునరేషన్ లేదని పేర్కొంది.
దీంతో ఈ రెండేళ్లలో రిలయన్స్ సంస్థ అంబానీకి అందించే శాలరీతో పాటు అలవెన్సులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, సోషల్ సెక్యూరిటీ, రిటైరల్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ ఆప్షన్స్‌ను కోల్పోయారు.
గడిచిన ఆర్ధిక సంవత్సరాల్లో 2020,2021,2022 మార్చి వరకు ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసులేదు. కానీ 2020కి ముందు ఆయన శాలరీ భారీగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం..
►రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్ అంబానీ మేనేజిరీయల్ కాంపన్సేష లెవల్స్ ఆర్డర్ ప్రకారం..2008-2009లో సుమారు రూ.15కోట్లు శాలరీ తీసుకున్నారు.
► నాటి నుంచి అంటే 2008-09 నుండి 2019-2020 వరకు ఈ 11ఏళ్ల కాలంలో ఏడాదికి జీతం రూ.15కోట్లు మాత్రమే తీసుకున్నారు.
చదవండి👉ముఖేష్ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే!
Comments
Please login to add a commentAdd a comment