రిలయన్స్‌ జియోలో ఏఐడీఏ పెట్టుబడి | Reliance Jio Gets Five Thousand Crore Investment | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియోలో ఏఐడీఏ పెట్టుబడి

Published Sun, Jun 7 2020 9:07 PM | Last Updated on Sun, Jun 7 2020 9:24 PM

Reliance Jio Gets Five Thousand Crore Investment  - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌ల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ(ఏఐడీఏ) జియో ప్లాట్‌ఫార్మ్స్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. జియోలో 1.16 శాతం వాటా కోసం ఏఐడీఏ రూ.5,684 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. గత ఏడు వారాల్లో జియోలో వచ్చిన ఎనిమిదవ పెట్టుబడి ఇది. ఈ ఎనిమిది ఒప్పందాల‌ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.97,856 కోట్లకు చేరింది. ఇటీవలే  ఫేస్ బుక్, విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, తదితర సంస్థలు రిలయన్స్‌ జియోలో పెట్టుబడులు పెట్టాయి.

తాజా పెట్టుబడితో జియో ఈక్విటీ వాల్యుయేషన్(విలువ) రూ.4.91 లక్షల కోట్లు చేరుకోగా.. ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్(విలువ) రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది.  తాజాగా  అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ పెట్టుబడి పెట్టడంతో సంస్థ మరింత వృద్ధి చెందుతుందని రిలయన్స్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
చదవండి: మరో మెగా డీల్ : అంబానీ కల నెలవేరినట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement