
సిడ్నీ: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా Sarah Marschke తన కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా.. 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియాగా ఎంపికైంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన పొడవాటి అందమైన కాళ్లే కారణమని ఈ బ్యూటీ చెబుతోంది. అందుకే తన శరీరంలోని అందమైన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించానని తెలిపింది. కాగా, కాళ్లు పొడవుగా ఉండటంతో చిన్నతనంలో తనను స్నేహితులు ఆటపట్టించేవాళ్లని ఆమె గుర్తు చేసుకుంది. అయితే ఎదిగే క్రమంలో తన కాళ్లే తనకు అందాన్ని ఇస్తాయని ఊహించలేదని పేర్కొంది. గతంలో తన కాళ్లను హేళను చేసినవాళ్లే ఇప్పుడు ఆరాధిస్తున్నారని ఈ పొడుగు కాళ్ల సుందరి గర్వంగా చెప్పుకుంటుంది.
మరోవైపు సారా కుటుంబంలో చాలా మంది రగ్బీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఆమె మాత్రం ఫుట్‌బాల్ వైపు అడుగులు వేస్తోంది. త్వరలో ఆమె ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ ఉమెన్స్ లీగ్‌లో ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీడియా సంస్థలు సారాకు సంబంధించి రోజూ ఏదో ఒక న్యూస్‌ను రాసేందుకు పోటీపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం ఆస్ట్రేలియా మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సారాకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 16,000 మంది అనుసరిస్తున్నారు.
చదవండి: వైరల్ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment