WI VS IND 2nd Test: Miss World Trinidad And Tobago Met Shubman Gill, Ishan Kishan, Yashasvi Jaiswal - Sakshi
Sakshi News home page

WI VS IND 2nd Test: టీమిండియా యంగ్‌ ప్లేయర్లను కలిసిన మిస్‌ వరల్డ్‌

Published Sun, Jul 23 2023 4:12 PM | Last Updated on Sun, Jul 23 2023 4:34 PM

WI VS IND 2nd Test: Miss World Trinidad And Tobago Met Shubman Gill, Ishan Kishan, Yashasvi Jaiswal - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్‌ వరల్డ్‌ ఆఫ్ ట్రినిడాడ్ అండ్‌ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ టీమిండియా యంగ్‌ స్టార్‌ ప్లేయర్స్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌లను కలిసింది. ఈ సందర్భంగా ఆమె వారితో మాటామంతి జరిపి, అనంతరం ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చింది.

అంతటితో ఆగని మిస్‌ వరల్డ్‌, టీమిండియా యంగ్‌ గన్స్‌తో దిగిన ఫోటోలను తన సోషల్‌మీడియా అకౌంట్స్‌కు స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు దర్శనమిస్తున్నాయి. టీమిండియా యువ స్టార్ల క్రేజ్‌ అలా ఉంది మరి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

కాగా, మిస్‌ వరల్డ్‌ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్.. వెస్టిండియన్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా ఆహ్వానం మేరకు భారత్‌-విండీస్‌ మ్యాచ్‌ చూసేందుకు క్వీన్స్ పార్క్ ఓవల్‌ మైదానానికి వచ్చింది. 

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (75), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (33), కిర్క్‌ మెక్‌కెంజీ (32), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (20), జాషువ డిసిల్వ (10) ఔట్‌ కాగా.. అలిక్‌ అథనేజ్‌ (37), జేసన్‌ హోల్డర్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్‌ కుమార్‌, సిరాజ్‌, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్‌ (80), జడేజా (61), అశ్విన్‌ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వార్రికన్‌ చెరో 3 వికెట్లు.. హోల్డర్‌ 2, గాబ్రియల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement