
సాక్షి, విజయవాడ : మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలవడమే తన ముందున్న లక్ష్యమని మిస్ ఇండియా-2018 అనుకృతి వాస్ తెలిపారు. సాక్షి టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదట్లో అందాల పోటీలకు వెళ్లొద్దన్ని అడ్డుకున్నవారే ఇప్పుడు తనను అభినందిస్తున్నారని తెలిపారు. తన బలం అమ్మేనని, తన విజయం క్రెడిట్ ఆమెకే దక్కుతుందని అన్నారు. ‘అమ్మాయిలు కలలు కనాలి. వాటిని సాధించాలి’ అని సూచించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు.