Miss India 2018
-
అనుకోకుండా దక్కిన గెలుపు
విజయం ఇచ్చే కిక్ అలా ఇలా ఉండదు. అందులో ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. అది ఎలా దక్కినా మజా భలేగా ఉంటుంది. అందునా అనూహ్యంగా గెలుపు లభిస్తే.. ఆ ఉత్సాహం ఆకాశం అంచుకు తీసుకెళ్తుంది. క్యాట్ వాక్ ఎలా చేస్తారో కూడా అంతగా తెలియని అమ్మాయి అందాల పోటీలో రెండు కిరీటాలు దక్కించుకుంటే.. ఆమె సంబరం అలా ఉంటుంది. మోడలింగ్ పోటీల్లో ఒక్కసారి కూడా పాల్గొనని యువతి మిస్ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్‌గా, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా రెండు మకుటాలు సొంతం చేసుకుంటే ఆమె అంబరం అంచుల్లో తేలిపోవడంలో ఆశ్చర్యమేముంది? విశాఖకు చెందిన మామిడి సాయి వెంకట పల్లవి ఇప్పుడా ఆనందోత్సాహాలలో మునిగితేలుతోంది. డాజిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో రెండు కిరీటాలు సాధించిన పల్లవి ఆ సంస్థ ప్రచారకర్తగా ఎంపికయింది. అనుకోకుండా గెలుపు దక్కినందుకు ఆనందంగా ఉందని, అయితే ఫలితాన్ని ఆశించకుండా కష్టపడ్డానని పల్లవి చెబుతోంది. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘అనుకోకుండా దక్కిన గెలుపు ఎంత సంబరాన్నిస్తుందో ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. మోడలింగ్ పోటీల్లో పాల్గొన్న అనుభవం లేకుండా.. క్యాట్ వాక్ ఎలా చేస్తారో తెలియకుండా నేను రెండు టైటిళ్లు గెలిచానంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉంది.’ అని మిస్ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్, మిస్ ఆంధ్రప్రదేశ్ మామిడి సాయి వెంకట పల్లవి ఉత్సాహంతో అన్నారు. ఈ పోటీల్లో గెలుపు అనూహ్యమైనదే అయినా.. తాను మాత్రం ఫలితంపై దృష్టి పెట్టకుండా కష్టబడ్డానని చెప్పారు. తన జీవితం గురించి, లక్ష్యాల గురించి ఆమె వివరిస్తూ.. నిజానికి మోడలింగ్‌పై మొదట్లో తనకు దృష్టి లేదని చెప్పారు. ‘నేను ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నా. అందుకు సంబంధిత కోర్సు కూడా చేశా. అయితే అమ్మ, నా స్నేహితులు మాత్రం మోడలింగ్ వైపు వెళ్లాలని ప్రోత్సహించారు. దాంతో ఆ రంగంవైపు అడుగులేశాను.’ అని చెప్పారు. 83 నుంచి 60 కిలోలకు... ‘మోడలింగ్ చేయాలని అనుకున్నానే కానీ అధిక బరువు నన్ను భయపెట్టింది. ఎలాగైనా బరువు తగ్గాలని సంకల్పించాను. అందుకు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. అలా 83 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాను. నాలో మార్పు చూసి ఆశ్చర్యపోని వారు లేరు. చివరికి జిమ్‌లో ఇన్స్ట్రక్టర్లు కూడా అబ్బురపడ్డారు. ఇప్పుడు ఆ జిమ్ నిర్వాహకులు నా ఫోటోను వారి ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.’ అని చెప్పింది. టాలెంట్ ఒక్కటే లెక్క ‘ఒకప్పుడు మోడలింగ్ అంటే రకరకాల అభిప్రాయాలుండేవి. కొన్ని విషయాల్లో రాజీ పడితే తప్ప ఆ రంగంలో రాణించలేరన్న తప్పుడు అభిప్రాయం ఉండేది. అది చాలా తప్పు. నిజానికి ఎప్పుడైనా ఎక్కడైనా టాలెంట్ ఉంటే విజయం దక్కుతుంది. ప్రతిభ కలవారికి ఆకాశమే హద్దనుకునే పరిస్థితి ఉంది. కేవలం ప్రతిభను నమ్ముకుని రంగంలోకి దిగిన నాకు గెలుపు లభించడం బట్టి చూస్తే... టాలెంట్‌కు గల ప్రాధాన్యం అర్థమవుతుంది.’ అని ఆమె చెప్పారు. సమాజ సేవ ధ్యేయం ‘విద్యార్ధిగా ఉన్నప్పుడు రాబిన్ హుడ్ ఆర్మీలో సభ్యురాలిగా ఉండేదానిని. అలా పదిమందికీ ప్రయోజకం కలిగించే పనులు చేసేదానిని. భవిష్యత్తులో సమాజ సేవను కొనసాగిస్తాను. నాకు అవకాశాలు కల్పించిన సమాజానికి వీలైనంత మేరకు మేలు కలిగేలా కృషి చేస్తాను.’ అని పల్లవి చెప్పారు. ప్రాథమిక విద్య అందని పిల్లలకు విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతానికి ప్రత్యేకించి లక్ష్యాలు లేనప్పటికీ మోడలింగ్‌లో ఉన్నత స్థానానికి చేరడమే తన ధ్యేయమని.. ఎప్పటికైనా మిస్ యూనివర్స్ కావాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ రంగం నుంచి సినీ రంగానికి వెళ్లేందుకు పట్టుదలతో కృషి చేస్తానన్నారు. -
వద్దంటే వద్దన్నారు!
‘‘పందొమ్మిదేళ్లకే ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుపొందా. ‘అందాల పోటీలా! అంగాంగ ప్రదర్శనలా.. వద్దంటే వద్దు..’ అన్నారు మా బంధువులంతా. పోటీలకు వెళ్లకుండా అడ్డుకున్నారు కూడా. ఇప్పుడు సాధించాను. కౌగిలించుకుని అభినందిస్తున్నారు’’ అని ఎంతో సంతోషంగా చెబుతున్నారు అనుకృతీ వాస్. ఆమె గురించి మరికొన్ని విశేషాలు. ఇప్పటికైతే పక్కనపెట్టేశా! అమ్మ లేకపోతే నేను లేను. ఒంటరి అమ్మ నా కోసం పోరాడి నా విజయానికి కారణమైంది. నా లక్ష్యాన్ని గౌరవించింది. ‘డ్రెస్ అలా వేయద్దు.. ఇలా ఉండొద్దు.. మేకప్‌తో ఊళ్లు తిరగొద్దు’ అని మా అమ్మమ్మ మమ్మల్ని అడ్డుకునేది. కానీ.. అమ్మ నన్ను నమ్మింది. దాని ఫలితమే ఇది. నా కృషి, పట్టుదల కూడా నాకు తోడయ్యాయి. ఇప్పటి యువతకు ఒకటే చెపుతున్నా. గోల్స్ పెట్టుకోండి. వాటిని సాధించండి. అది ఏ రంగమైనా! నా ముందున్న లక్ష్యం విశ్వసుందరిగా మిస్ వరల్డ్ కిరీటం కైవసం చేసుకోవటమే. చాలా శ్రమించాలి. ఇందుకోసం చదువును కూడా పక్కన పెట్టి కసరత్తు చేస్తున్నా. మన తీరు మారాలి సమాజంలో ట్రాన్స్‌జెండర్ పై చాలా అపోహలు ఉన్నాయి. అవి మారాలి. నేను ట్రాన్స్ జెండర్ ఎడ్యుకేషన్‌కు సాయపడతా. వారికి సాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. భారతదేశంలో చైల్డ్ అబ్యూస్పై కూడా చాలా అవగాహన అవసరం. ఇందుకు అన్ని రంగాల వారు ప్రాధాన్యం ఇవ్వాలి. హిందీ నేర్చుకుంటున్నా మిస్ ఇండియా అంటే బాహ్య అందం కాదు. అంతఃసౌందర్యం. ఫ్యాషన్ ఫీల్డ్‌పై సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, మోడల్ రంగంపై ముందు అవగాహన పెంపొందించుకోవాలి. సరైన ప్రోత్సాహం, అవగాహన ఉండాలి. తమిళనాడు నుండి గెలవటం చాలా గొప్పగా ఫీలవుతున్నా. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. తమిళ్.. మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ప్లస్‌గా నిలిచింది. ఇప్పుడు హిందీ కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడే చెప్పలేను నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. చాలా దూరం వెళ్లాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. రేపు ఏ రంగంలోకి వెళ్తానో ఇప్పుడు చెప్పలేను. నేను సైంటిస్ట్ కావచ్చు లేక మరేదైనా కానీ! ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ‘మిస్ వరల్డ్ మిస్ ఇండియా’. ఈ పోటీల్లో ధనవంతులే గెలుస్తారనే అపోహ ఉండేది. నాతో అది తొలగి ఉంటుంది. అనుకృతీవాస్ నచ్చిన టాపిక్ : ఫుడ్డు నచ్చిన ప్రదేశం : పుదుచ్చేరి ఇష్టాలు : ప్రయాణాలు నచ్చిన నటుడు : అందరూ ఇష్టమైన వ్యక్తి : అమ్మ చదువు : చెన్నై లయోలాలో బి.ఎ. (ఫ్రెంచ్) సెకండ్ ఇయర్. మనకు తెలియనివి : అనుకృతి అథ్లెట్, బైక్ రేసర్ కూడా. అమ్మాయిలకు ఇచ్చే సలహా : మీరు మీలా ఉండండి. మీక్కావలసింది ఎప్పటికైనా సాధించుకోగలరు. – సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై -
విశ్వ సుందరి కిరీటమే లక్ష్యం
మిస్ ఇండియా అనుకృతి వాస్ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిస్ ఇండియా కిరీటంతో స్వగ్రామం చేరుకున్న ఆమెకు ఆప్తులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనుకృతి వాస్ అందరితోనూ ఆనంద క్షణాల్ని పంచుకున్నారు. సాక్షి, చెన్నై : మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతి వాస్ తమిళనాడుకు చెందిన వారే. తిరుచ్చి కోట్టూరు సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, షెలినా దంపతుల కుమార్తె ఈ అనుకృతి వాస్. ఈమెకు ఇంజినీరింగ్ చదువుతున్న సోదరుడు గౌతమ్ కూడా ఉన్నారు. అనుకృతి వాస్కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని వీడి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తల్లి షెలినా సంరక్షణలో పెరిగారు. బాల్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్యా భ్యాషం అంతా తిరుచ్చిలో సాగింది. ఉన్నత చదువు చెన్నై లయోల కళాశాలలో బీఏ –ఫ్రెంచ్ చదువుతున్నారు. తమ బిడ్డ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆప్తులు, సరస్వతి నగర్ వాసులే కాదు, సహచర విద్యార్థినులు, స్నేహితులు అను రాకకోసం ఎదురు చూశారు. అయితే, శనివారం స్వస్థలానికి ఆమె వస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఉదయాన్నే సరస్వతి నగర్‌కు చేరుకున్న అనుకృతి వాస్కు కుటుంబీకులు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు ఆహ్వానం పలికారు. మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ అను ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోనూ.. తిరుచ్చిలో కుటుంబీకులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకునేందుకు అను వచ్చిన సమాచారంతో అభిమానులు పోటెత్తారు. సరస్వతి నగర్ పరిసర వాసులు, తిరుచ్చిలోనూ పలు సంస్థలు, యువజనులు తరలివచ్చి ఆమెను అభినందించారు. అక్కడి నుంచి అనుకృతి వాస్ సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. ఇక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను పలు సంస్థలు సత్కరించి, అభినందించాయి. కాగా, తల్లి సంరక్షణలో పెరిగినా, తన వంతుగా సామాజిక సేవను సైతం అనుకృతి వాస్ సాగిస్తుండడం విశేషం. హిజ్రాలకు విద్యను బోధిస్తున్నారు. అగ్ని అనే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ విద్య లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. చిన్న అనాథాశ్రమాన్ని సైతం నిర్వహిస్తున్న అనుకృతి వాస్‌ను ప్రముఖులు పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వ సుందరి కిరీటం లక్ష్యం అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశ్వ సుందరి కిరీటం లక్ష్యం విశ్వ సుందరి 2018 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకృతి తన సామాజిక సేవను, తన లక్ష్యాన్ని మీడియా ముందు ఉంచారు. 30 మంది పిల్లలతో తాను చిన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ విద్య దక్కాలని, స్వయం ప్రతిభతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఇందులో భాగంగా ముప్ఫై మంది హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. సమాజానికి తన వంతు సహకారం అందించే రీతిలో బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇక, తన విజయానికి కారణం తల్లి అని ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని, తనను సూపర్ ఉమెన్‌గా ఆమె భావించే వారు అని తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతికూల దృక్పథాన్ని వీడి అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని, అన్నింటా జయ కేతనం ఎగుర వేయగలరని వ్యాఖ్యానించారు. కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యంతో లక్ష్య సాధనపై దృష్టిని సారించిన పక్షంలో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. అనుకృతి వాస్ ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
మిస్ వరల్డ్ కిరీటమే నా లక్ష్యం
సాక్షి, విజయవాడ : మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలవడమే తన ముందున్న లక్ష్యమని మిస్ ఇండియా-2018 అనుకృతి వాస్ తెలిపారు. సాక్షి టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదట్లో అందాల పోటీలకు వెళ్లొద్దన్ని అడ్డుకున్నవారే ఇప్పుడు తనను అభినందిస్తున్నారని తెలిపారు. తన బలం అమ్మేనని, తన విజయం క్రెడిట్ ఆమెకే దక్కుతుందని అన్నారు. ‘అమ్మాయిలు కలలు కనాలి. వాటిని సాధించాలి’ అని సూచించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. -
మిస్ ఇండియా-2018 అనుకృతి వాస్
-
మా పేరెంట్స్ చాలా భయపడ్డారు
సాక్షి, ముంబై: ఫెమినా మిస్ ఇండియా-2018 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) రెండో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటారు. ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.. ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘అర్కిటెక్ అయిన నాకు మిస్ ఇండియా పోటీలకు యత్నించటం తొలుత కష్టంగానే అనిపించింది. ర్యాంప్ వాక్ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. పైగా మేకప్ వేసుకోవటం కూడా నాకు రాదు. దీనికితోడు అందాల పోటీలు అనగానే నా పెరెంట్స్ ఒక్కసారిగా భయపడ్డారు. వారిలో తెలీని ఏదో ఆందోళన. నా అడిషన్స్ అన్నీ చూశాక వాళ్ల అభిప్రాయం మారింది. ఇది కేవలం ఒక్క అందాల పోటీలే కాదని, నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్న నమ్మకం వారికి ఏర్పడింది. అందుకే చివర్లో మంచి ప్రోత్సాహం అందించారు. సాధ్యమైనంత వరకు నా వ్యవహారాలు నేనే చూసుకున్నా’ని ఆమె తెలిపారు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, ఇంత కంటే పెద్ద విజయాన్ని తన దేశానికి అందించాలనుకున్నట్లు శ్రేయా ధీమాతో చెబుతున్నారు. ‘నా కల తీరాక తిరిగి నా ప్రొఫెషన్‌కు వెళ్లిపోతా. విద్యాసంస్థలు నెలకొల్పటం నా కల. అది నెరవేరే దాకా కృషి చేస్తా. అంతేగానీ గ్లామర్ వరల్డ్‌లో మాత్రం అడుగుపెట్టదల్చుకోలేదు’ శ్రేయా రావు స్పష్టం చేశారు. కాగా, రెండో రన్నరప్ అయిన శ్రేయా.. మిస్ యునైటెడ్ కాంటీనెంట్స్ 2018 పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. -
తమిళపొన్నుకు మిస్ ఇండియా 2018 కిరీటం