వారితో పోలిస్తే మాది అందమే కాదు! | Priyanka Chopra regains sexiest Asian crown in UK | Sakshi
Sakshi News home page

వారితో పోలిస్తే మాది అందమే కాదు!

Published Thu, Dec 4 2014 10:38 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

వారితో పోలిస్తే మాది అందమే కాదు! - Sakshi

వారితో పోలిస్తే మాది అందమే కాదు!

 ప్రియాంకా చోప్రా పద్నాలుగేళ్ల క్రితమే మిస్ వరల్డ్. ఆ తర్వాత వెండితెర మీదకొచ్చి అటు తన నటనతోనూ, గ్లామర్‌తోనూ అగ్రస్థాయికెదిగారు. జాతీయ అవార్డు మొదలుకొని లెక్కలేనన్ని పురస్కారాలు గెలుచు కున్నారు. తాజాగా ఈ అందాల రాణి కీర్తి కిరీటంలోకి మరో మణి వచ్చి చేరింది. యూకే వీక్లీ న్యూస్ పేపర్, ఈస్ట్రన్ ఐ సంస్థలు కలిసి నిర్వహించిన పోటీలో ప్రపంచంలోకెల్లా ‘అత్యంత సెక్సీ ఆసియా మహిళ’గా అందగత్తెలందర్నీ వెనక్కు నెట్టి ‘నంబర్‌వన్’గా నిలిచారు ప్రియాంక. గత ఏడాది ఈ గౌరవం కత్రినా కైఫ్‌కి దక్కింది.
 
 ఈ ఏడాది ఆ గౌరవం ప్రియాంకకు దక్కింది. తాజాగా నిర్వహించిన సర్వేలో కత్రినా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ప్రియాంక స్పందిస్తూ -‘‘‘నాకంటే శృంగార దేవత ఈ ఆసియా ఖండంలోనే లేదు’ అని అంటే.. అది నిజంగా హాస్యాస్పదమే. దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ పురస్కారం అందిస్తారో నాకు తెలీదు. ఏది ఏమైనా నన్ను ఎన్నుకున్న కమిటీకి, గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు. వెలుగులో లేని, రాని ఎందరో అందాల రాశులు ఈ ఖండంలో ఉన్నారు. వారితో పోలిస్తే మాది అందమే కాదు. ఈ అవార్డు వారికే అంకితం’’ అన్నారు ప్రియాంక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement