ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్‌ | India Will Host Miss World Contests | Sakshi
Sakshi News home page

Miss World Pageant: భారత్‌లోనే మిస్‌ వరల్డ్‌ పోటీలు

Published Fri, Jan 19 2024 9:23 PM | Last Updated on Fri, Jan 19 2024 9:29 PM

India Will Host Miss World Contests  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ తన అధికారిక ఎక్స్‌(ట్విటర్‌)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించారు.

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌,  ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్‌ తదితరులు మిస్‌ వరల్డ్‌గా ఎంపికయ్యారు. 

ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement