ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా | Azadi Ka Amrit Mahotsav Vinjamuri Anasuya Singer Story | Sakshi
Sakshi News home page

ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా

Published Mon, Aug 15 2022 9:44 AM | Last Updated on Mon, Aug 15 2022 9:45 AM

Azadi Ka Amrit Mahotsav Vinjamuri Anasuya Singer Story - Sakshi

మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్న ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్‌ పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను.

10 గం.లకి వై.యమ్‌.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు చేసిన స్వాతంత్య్ర రథం కార్యక్రమంలోను ఒకే రోజున అన్ని లైవ్‌లు పాడాను. ఊరంతా పండగలా అలంకరించారు.

దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. అలంకరించారు. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకారం అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్‌  క్రియేట్‌ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి; ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్‌  రిబ్బన్లు పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్‌కి కూడా బోర్డర్‌ వేసుకున్నాను. టైలర్‌ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్‌కూడా హిట్‌అయ్యింది.
– కీ. శే. వింజమూరి అనసూయ, గాయని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement