శతమానం భారతి: జమ్మూకశ్మీర్‌ | Azadi Ka Amrit Mahotsav Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌

Published Thu, Aug 11 2022 6:28 PM | Last Updated on Thu, Aug 11 2022 6:33 PM

Azadi Ka Amrit Mahotsav Jammu Kashmir - Sakshi

మూడేళ్ల క్రిందట ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. దశాబ్దాల అంతరాన్ని అంతం చేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ లకు ఆర్టికల్‌ 370 నుంచి విముక్తి కల్పిం చింది. దీంతో ‘ఏక్‌ భారత్‌ – శ్రేష్ఠ భారత్‌’ భావన మరింత బలం పుంజుకుంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగం లోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం అంటే, స్వతంత్ర భారతదేశానికి పునరేకీకరణ శక్తిని ఇవ్వడమే.

ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లుగా జమ్ము కశ్మీర్‌ ప్రగతి పథంలో శరవేగంతో పరుగులు తీస్తోంది. అక్కడి ఉపాధి, సౌభాగ్యాలకు కొత్త ఉత్తేజం లభించింది. జమ్ము కశ్మీర్‌కు 7 కొత్త వైద్య కళాశాలలు, 5 కొత్త నర్సింగ్‌ కళాశాలు మంజూరు అయ్యాయి. వైద్య కోర్సులలో సీట్ల సంఖ్య 500 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. జల విద్యుత్‌ ప్రాజక్టులు ఉద్పాదన ప్రారంభించాయి. వాటి ద్వారా పరిశ్రమ లకు ప్రయోజనంతో పాటు ఆ ప్రాంతాల రాబడీ పెరుగుతోంది.

వ్యవసాయ రంగ ప్రగతితో కూడా ఆదాయం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోంది. జమ్ము, కశ్మీర్‌లో కొత్తగా అమలవుతున్న ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్టు’ పథకం సగటు ప్రజల జీవితాలను సులభతరం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఉజ్వల, డి.బి.టి., సౌభాగ్యం వంటి అనేక పథకాలు 100 శాతం అమలవుతున్నాయి. 2024 కల్లా ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సురక్షిత తాగునీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం.. రెండేళ్ల ముందుగానే ఈ ఆగస్టు 15 కల్లా పూర్తి లక్ష్యాన్ని నెరవేర్చనుంది!  దేశంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద ప్రతి వ్యక్తీ లబ్ది పొందిన ఏకైక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం.. జమ్ము కశ్మీర్‌ మాత్రమే కావడం విశేషం. 

(చదవండి: చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement