బోడో ఒప్పందంపై సంతకాలు
బృహత్కార్యాలు తలపెట్టినప్పుడు కొన్ని సందర్భాలలో వెనక్కు చూడాల్సి రావచ్చు. అలా పోల్చి చూసుకున్నప్పుడే మనం ఎంత ముందడుగు వేశామో తెలుసుకోగలం. గత ఎనిమిదేళ్లలో ఒక వైపు తక్షణ సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు దీర్ఘకాలిక పరిష్కారాల గురించి భారత్ యోచిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు అందివచ్చాయి. ఆ విధంగా దేశ విదేశాల్లో భారతదేశంపై గౌరవం పెరిగింది. భారత అంకుర సంస్థల గురించి ప్రపంచవ్యాప్తంగా; భారత్‌లో వాణిజ్య సౌలభ్యం గురించి ప్రపంచ బ్యాంకు స్థాయిలో.. విస్తృత చర్చ సాగుతోంది.
మొబైల్, జన్‌ధన్, ఆధార్‌ల సమ్మేళనంతో సృష్టించిన ‘త్రిశక్తి’ సూత్రం (జెఎఎమ్–ట్రì నిటీ) నేటి ప్రధాన చర్చనీయాంశం అయింది. ఇక అజ్ఞాత యోధులకు పద్మ పురస్కారం గురించి మాట్లాడితే.. పద్మ పురస్కార ప్రదాన ప్రక్రియను సవరించ డంతో తొలిసారిగా దేశంలోని నిజమైన యోధులను సత్కరించే శాశ్వతమార్గం ఏర్పడింది. ఈ పరిణామంతో ఉన్నత వర్గాలకు మాత్రమే పద్మ పురస్కారం పరిమితమనే పరిస్థితి తప్పి, సాధారణ ప్రజానీకం కూడా ఇందుకు అర్హులేనన్న భావన నెలకొంది. మరోవైపు ఈశాన్యం లో శాంతి కోసం బోడో ఒప్పందం కుదిరింది. ఐదు దశాబ్దాల ఎదురు చూపులు ఈ బోడో ఒప్పందంతో ఫలించాయి. ఒప్పందంలో భాగంగా బోడో ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రు.1,500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. ఇవి మాత్రమే కాదు. స్వాతంత్య్రం సిద్ధించి 100 వ సంవత్సరంలోకి ప్రవేశించేనాటికి నిర్దేశిత ఉన్నత శిఖరాలకు చేరే మార్గ ప్రణాళికపైనా ప్రభుత్వం కృషి చేస్తోంది.
,
Comments
Please login to add a commentAdd a comment