
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన కార్యక్రమమే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందుగా ఈ మహోత్సవ్ ప్రారంభమైంది. నేటితో ముగుస్తోంది.
కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాల ప్రముఖులతో అమృత్ మహోత్సవ్ జాతీయ అమలు కమిటీ ఏర్పాటైంది. డెబ్బయ్ ఐదు వారాల పాటు దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఈ కమిటీ దిగ్విజయంగా అమలు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, ప్రజల్ని భాగస్వాములను చేసింది. దండియాత్ర జరిగిన మార్చి 12 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం అయింది.
వేడుకలను ప్రారంభించే చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఆ మేరకు ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, ఝాన్సీ కోట, జైపూర్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాల వద్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment