మహోజ్వల భారతి: వాటర్‌మ్యాన్‌ | azadi ka amrit mahotsav freedom fighters history | Sakshi
Sakshi News home page

మహోజ్వల భారతి: వాటర్‌మ్యాన్‌

Published Sat, Aug 6 2022 2:16 PM | Last Updated on Sat, Aug 6 2022 2:18 PM

azadi ka amrit mahotsav freedom fighters history - Sakshi

డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ రాజస్థాన్, అల్వార్‌ జిల్లాకు చెందిన జల పరిరక్షకులు, సంఘసేవకులు. ‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందారు. స్టాక్‌హోం వాటర్‌ ప్రైజ్‌ ను గెలుచుకున్నారు.  ప్రభుత్వేతర సంస్థ ‘తరుణ్‌ భారత్‌ సంఘ్‌’ ఆయన స్థాపించినదే. నేడు రాజేంద్ర సింగ్‌ జన్మదినం. 1959 ఆగస్టు 6న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మంచినీటి నిర్వహణకు విశేషకృషి చేసినందుకు గాను 2001 లో రామన్‌ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నారు.

రాజేంద్రసింగ్‌ కృషి వల్ల రాజస్థాన్‌లో అర్వారి, రూపారెల్, సర్సా, భగా ఆని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి! 2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టానికి (1986) అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థ ‘నేషనల్‌ గంగా రివర్‌ బేసిన్‌ అథారిటీ’ సభ్యులలో రాజేంద్ర సింగ్‌ ఒకరు. ‘గ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది వ్యక్తులు’ జాబితాలో ప్రఖ్యాత ‘గార్డియన్‌’ పత్రిక రాజేంద్రసింగ్‌కి స్థానం కల్పించింది.
చదవండి: జైహింద్‌ స్పెషల్‌: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement