Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణాలతో కూడిన డీపీలు పెడుతున్నారు నెటిజన్లు. భారత 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ పంచుకుంటూ త్రివర్ణ శోభితం చేస్తున్నారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ జాబితాలో చేరాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మువ్వన్నెల జెండాను తన డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టాడు. ఇందుకు ‘‘భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది’’ అన్న అర్థం వచ్చేలా సంస్కృత, ఆంగ్ల, హిందీ భాషల్లో కోట్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు ధోనిని ప్రశంసిస్తూ తాము కూడా ఇలాంటి డీపీనే పెడతామంటూ కామెంట్లు చేస్తున్నారు.
అత్యుత్తమ కెప్టెన్!
టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ధోనికి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడి సొంతం. ధోని సారథ్యంలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
ఇక దేశభక్తిని చాటుకోవడంలో ధోని ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. 2015 ప్రపంచకప్ సమయంలోనే ధోని సతీమణి సాక్షి తమ మొదటి సంతానం జీవాకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బిడ్డను చూసేందుకు వెళ్తారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘నేను దేశం కోసం కర్తవ్యం నిర్వర్తించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్నాను. నేషనల్ డ్యూటీ తర్వాతే మరేదైనా’’ అని ధోని సమాధానం ఇవ్వడం విశేషం.
సైనికుడిగా
భారత్ తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఇక ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించిన విషయం విదితమే.
చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే!
The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
Comments
Please login to add a commentAdd a comment