‘సాగర్ ’కు జీవం పోసిన రాజన్న | 'Telangana Rashtriya Samiti will be a distant second': Congress | Sakshi
Sakshi News home page

‘సాగర్ ’కు జీవం పోసిన రాజన్న

Published Sun, Apr 20 2014 3:19 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

'Telangana Rashtriya Samiti will be a distant second': Congress

ఆ‘పాత’ మధురం
న్యూస్‌లైన్, బాన్సువాడ, నిజాంకాలంలో నిర్మించిన జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టును పాలకులు పూర్తిగా విస్మరించారు. ప్రధాన కాలువ అస్తవ్యస్తంగా మారి, పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ఆయకట్టుకు రెండు తడులు కూడా అందని పరిస్థితి. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన రైతుబాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. పల్లెబాటలో భాగంగా 2005లో సాగర్‌ను సందర్శించారు.

 

ప్రధాన కాలువల ఆధునికీకరణకు 549 కోట్లను కేటాయించారు. ఈ పనులకు శంకుస్థాపన వేసేందుకు 2008లో రాజన్న నిజాంసాగర్ వచ్చారు. అప్పుడు ఆయన వెంట షబ్బీర్‌అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్‌రెడ్డి, సౌదాగర్ గంగారాం, కేఆర్ సురేష్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్.వెంకట్రాంరెడ్డి, డి.రాజేశ్వర్, జనార్దన్‌గౌడ్, నేరేళ్ల ఆంజనేయులు ఉన్నారు. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు కలిసి ఉన్న వీరిలో ఇప్పుడు చాలామంది వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement