సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల నిర్మాణం విషయంలో నిజాం గొప్పరాజే అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ నిజాం గొప్పరాజు అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో, అన్నింటికీ వేర్వేరుగా దవాఖానాలను కట్టించిన ఘనత నిజాందేనన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. మరోవైపు విజన్ ఉన్న పాలకుడు నిజాం నవాబు అని, అందుకే భవిష్యత్తును ముందే అంచనా వేసి దూరదృష్టిలో అసెంబ్లీ, ఆర్ట్స్ కాలేజ్, హాస్పిటళ్లు వంటి నిర్మాణాలు చేశాడని, కానీ చంద్రబాబుకు విజన్ లేదని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు.
నిజాం గొప్ప రాజే: షబ్బీర్
Published Sun, Jan 4 2015 7:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement