అమరుల త్యాగఫలితమే తెలంగాణ విముక్తి
పెద్దకొత్తపల్లి:
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ కార్యకర్తలు చేసిన పో రాటా ల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
పెద్దకొత్తపల్లి:
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ కార్యకర్తలు చేసిన పో రాటా ల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పెద్దకొత్తపల్లిలో తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా ఈనెల 11నుంచి 17వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో మంగళవారం స్మారక స్థూపం భూమిపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యూరు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ నిజాం నిరంకుంశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూని స్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం లో 4500మంది అమరులయ్యారన్నారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. ఈ పోరాటంలో అసువులు బాసిన జిల్లాకు చెందిన కామ్రెడ్ చిన్న లింగారెడ్డి, బుగ్గన్న, సి.ఆర్.శర్మ, మాసయ్యల జ్ఞాపకార్థం సంస్కరణ స్థూపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కు రుణమాఫీ చేయకుండా షరతుల పే రుతో రైతులను వేధిస్తుందన్నారు. కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించి వలసలు నివారించాలని కోరారు. బీజేపీ తెలంగాణ సాధనకు ఏనాడూ పోరాడలేదని, ఎన్నో పోరాటాలు నిర్వహించిన ఘనత కమ్యూనిస్టులకు మాత్రమే దక్కుతుందన్నారు.
మోటారు సైకిల్ ర్యాలీ
తెలంగాణ విముక్తి పోరాటాల వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసు కాల్పుల్లో మృతి చెందిన అమరవీరుల చిత్ర పటాలతో వ సీపీఐ నాయకులు ఫయాజ్ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పోలీసుస్టేషన్ నుంచి అమరుల స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహ్మా, సహాయ కార్యదర్శి కందాల రామకృష్ణ, బాల్‌నర్సింహ్మా, మండల కార్యదర్శి శ్రీనివాసులు, ఉస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.