న్యాయం చేయండి: నిజాం మనవరాలు షఫియా షకీన | Nizam Mir Osman Ali Khan Great Daughter Seeks Government Help | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి: నిజాం మనవరాలు షఫియా షకీన

Published Fri, Mar 19 2021 9:03 AM | Last Updated on Fri, Mar 19 2021 11:25 AM

Nizam Mir Osman Ali Khan Great Daughter Seeks Government Help  - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సెస్‌ షఫియా షకీన

సాక్షి, హిమాయత్‌నగర్‌: మా తాత, నిజాం నవాబు వలేషాన్‌ ప్రిన్స్‌ మౌజామ్‌ జా బహుదూర్‌కు చెందిన ‘ప్రిన్స్‌ మౌజామ్‌ జా బహుదూర్‌ ట్రస్ట్‌’ స్థలాన్ని అన్యాయంగా ట్రస్టీ చైర్మన్‌ జాఫర్‌ జావెద్‌ కబ్జా చేశారని ఆ నవాబు ముని మనవరాలు, నిజాం నవాబ్‌ హుస్సేన్‌ అలీఖాన్‌ కుమార్తె ప్రిన్సెస్‌ షఫియా షకీన ఆరోపించారు. ట్రస్టుకు చెందిన స్థలాన్ని లీజుకు ఇవ్వడం కానీ, అమ్మడానికి కానీ వీలు లేదన్నారు. ట్రస్టులో నాకు భాగస్వామ్యం ఉన్నప్పటికీ నాకు ఏ మాత్రం చెప్పకుండా దానిని కబ్జా చేసి నాపై దౌర్జాన్యానికి తెగబడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఆమె భర్త మహ్మద్‌ అజారుద్దీన్‌ హైదర్, కుమారుడు హుస్సేన్‌ హైదర్‌లతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో 24.10 ఎకరాల్లో మా స్థలం ఉందని, మా తాత గారు 1949లో చనిపోయేప్పుడు ట్రస్టును ఏర్పాటు చేసి నాతో పాటు మరో 13 మందికి ట్రస్ట్‌ భాగస్వామ్యాన్ని అప్పగించారన్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో ముఫకంజా కాలేజీని స్థాపించి సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి కబ్జా కోరల్లో ఉన్న సదరు స్థలాన్ని కాపాడి, తమతో పాటు ట్రస్టు సభ్యులకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement