చరిత్ర తెలియని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
నిజాం కాలంలోజరిగిన మంచి పనులను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తించారని ఆయన చెప్పారు. నిజాం మంచి రాజు అని కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పడాన్ని ఇతర పార్టీల నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే.