సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానాన్ని 224 ఏళ్లు పాలించిన ఆసిఫ్‌జాహీల చివరి పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ ముఖఫంజా బహదూర్ లండన్ నుంచి నగరానికి వచ్చారు. ఇటీవల జరిగిన ప్రిన్సెస్ ఈసెన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
తాజ్ బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పేద అమ్మాయిల కార్పొరేట్ స్థాయి విద్య కోసం పాతబస్తీలో ప్రిన్సెస్ ఈసెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. దీనికి ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏటా రూ. 28 లక్షల స్కాలర్‌షిప్‌లు ఇచ్చి పేద అమ్మాయిలను చదివిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment