
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. శివనిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైగర్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు సైతం అదే జోరులో రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను మార్కును దాటేసింది.
(ఇది చదవండి: బాలీవుడ్‌లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్)
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.70.23 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఆదివారం కావడంతో ఖుషి కలెక్షన్స్ సునామీ ఆ రేంజ్‌లో దూసుకెళ్లింది. మూడో రోజు సైతం అన్ని భాషల్లో కలిపి రూ.11 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మొదటి రెండు రోజులను కలుపుకుని ఓవరాల్‌గా రూ.36.15 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. కాగా.. తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించింది.
కాగా.. కశ్మీర్ బ్యాప్ డ్రాప్‌లో తెరకెక్కించి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సక్సెస్ కావడంపై విజయ్ ఎమోషనలయ్యారు. మూవీ హిట్ కావడంతో కుటుంబ సమేతంగా వెళ్లి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: ఖుషి సక్సెస్.. యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం)
#Kushi scoring big at the BoxOffice, 70.23 cr+ gross worldwide in 3 days 💫✨
— Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023
Viplav & Aradhya are now household names for all the families 🤩
Book your tickets now!
- https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/VKhrbAEGXQ
Comments
Please login to add a commentAdd a comment