అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్‌టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.
2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment