
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్‌లో యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
(ఇది చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త)
దేవర రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. వీక్ డేస్‌లోనూ దేవరకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దేవరకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకోనుంది. కాగా.. ఈచిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు.
He’s the Dark Cloud of FEAR
looming over all rivals 🔥
See it. Feel it. Fear it in Cinemas now.#Devara #DevaraBlockbuster pic.twitter.com/v707pr9GGZ— Devara (@DevaraMovie) October 4, 2024