కమిటీ కుర్రోళ్ల కాసుల వర్షం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Tollywood Movie Committee Kurrollu 5 Days Box Office Collections, Deets Inside | Sakshi
Sakshi News home page

Committee Kurrollu Collections: బాక్సాఫీస్ వద్ద కమిటీ కుర్రోళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published Wed, Aug 14 2024 1:37 PM | Last Updated on Wed, Aug 14 2024 1:47 PM

Tollywood Movie Committee Kurrollu Collections In Just Five Days

కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాను నిహారిక సమర్పణలో ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందించారు. ఈ సినిమాను యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

మొదటి మూడు రోజుల్లో రూ.6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే రూ.8.49 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రం ద్వారా 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యమయ్యారు. ఇప్పటికే ఈ మూవీపై టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్‌ సైతం ప్రశంసలు కురిపించారు.

అసలు కథేంటంటే..
గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్‌ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్‌ సరోజ్‌).. ప్రస్తుత సర్పంచ్‌ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్‌)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.

గత జాతర సమయంలో కమిటీ కుర్రోళ్లు(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్‌ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement