బీఆర్‌ఎస్ కోసం ఆర్థిక వనరుల సమీకరణ
గత ప్రభుత్వ హయాంలో సాగిన వ్యవహారం
కీలకంగా వ్యవహరించిన పి.రాధాకిషన్‌రావు
శ్రీధర్‌రావును బెదిరించి డబ్బు వసూలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు, ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకి షన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయిని భుజంగరావు పోలీసుల ఎదుట వెల్లడించారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలా ల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభా కర్‌రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావు పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిష న్‌రావు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సెటిల్‌మెంట్లు పెద్దఎత్తున చేశారు. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్‌ఫోర్స్‌ను వినియోగించడంతోపాటు ప్రతిమ, యశోద ఆస్పత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు.
15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీమ్
తనతోపాటు ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్‌తో పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, పది మంది కానిస్టేబుళ్లు, మరో పది మంది హెడ్ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజూ గరిష్టంగా 40 ఫోన్లు ట్యాప్ చేశారు. తన కార్యాలయంలో మూడు సిస్టమ్స్‌తోపాటు తొమ్మిది లాగర్స్‌ను ఏర్పా టు చేసుకున్నారు.
ఇలా వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్‌రెడ్డి మిత్రులు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మిత్రు డు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, జి.వినోద్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసు కోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment