![Ananthika Sanilkumar 8 Vasantalu Movie Teaser Out Now](/styles/webp/s3/article_images/2024/10/12/8-vasanthalu.jpg.webp?itok=sJl1rPnz)
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపుపొందిన అనంతిక సానీల్‌కుమార్ నటిస్తున్న కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఈ సినిమాను ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
'8 వసంతాలు' చిత్రం నుంచి 'శుద్ధీ అయోధ్య టీజర్' పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment