పుష్ప ఫేం జగదీశ్‌ ప్రధాన పాత్రలో ‘సత్తిగాని రెండు ఎకరాలు’ | AHA Announces New Movie Sathi Gani Rendu Ekaralu Movie | Sakshi
Sakshi News home page

Aha-Mythri Movie Makers: పుష్ప ఫేం జగదీశ్‌ ప్రధాన పాత్రలో ‘సత్తిగాని రెండు ఎకరాలు’

Feb 6 2023 5:18 PM | Updated on Feb 6 2023 5:18 PM

AHA Announces New Movie Sathi Gani Rendu Ekaralu Movie - Sakshi

తొలి ఓటీటీ సంస్థ ఆహా ఎప్పటికప్పుడు డిజిటల్‌ ప్రియులను కొత్త చిత్రాలతో అలరిస్తూ ఉంటుంది. సరికొత్త కంటెంట్‌తో సినిమాలను రిలీజ్‌ చేస్తూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో వైవిధ్యమైన చిత్రాన్ని ఆహా ఆడియన్స్‌ మందుకు తీసుకురాబోతోంది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ‘సత్తిగాని రెండు ఎకరాలు’ మూవీ ఆహా వేదికగా విడుదల కానుంది. దీనిపై తాజాగా అధికారిక పకటన ఇచ్చింది ఆహా. 

కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో పుష్ప ఫేమ్ జ‌గ‌దీస్ భండారి ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ డిఫ‌రెంట్ రోల్ చేస్తున్నారు. డార్క్ కామెడీ జోన‌ర్‌లో ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్టులు, ట‌ర్న్‌లతో ఈ మూవీ ఆడియన్స్‌ని మెప్పించ‌నుంది. వెన్నెల కిషోర్ స‌హా ప‌లువురు న‌టీన‌టులు ఇందులో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించనున్నారు. క్రిస్మిస్‌ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆహాలో రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆహా వెల్లడించింది. 

ఈ సంద‌ర్భంగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఎంజాయ్ చేసే మన ప్రేక్షకుల కోసం మా బ్యానర్ నుంచి తొలి తెలుగు ఓటీటీ సినిమాను తీసుకు రాబోతున్నాం. ఇది మాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. మా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌టానికి, వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్ అందించ‌టానిఇకి, వారికి మ‌రింత ద‌గ్గ‌ర కావ‌టానికి మ‌రో మాధ్య‌మంలోకి అడుగు పెట్ట‌ట‌మ‌నేది చాలా సంతోషంగా ఉంది. స‌త్తిగాని రెండు ఎక‌రాలు ప‌వ‌ర్‌ఫుల్ స్టోరి లైన్‌తో పాటు అమేజింగ్ మ్యూజిక్‌తో మిళిత‌మై ఉంది. అలాగే ఆహాతో క‌లిసి ఈ సినిమా చేస్తుండ‌టం సంతోషంగా ఉంది. స‌త్తిగాని రెండు ఎక‌రాలు క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement