విజయ్ దేవరకొండ, సమంత తొలిసారి జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత హైప్ రాగా అప్పుడే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోకి హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పోలీసులు, మైత్రీన ఇర్వాహకులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టికెట్లు, పాస్‌లు ఉన్నా నో ఎంట్రీ
ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ కోసం అభిమానులు, సంగీత ప్రియులు ఎగబడి మరీ టికెట్లు కొనుకున్నాను. తీరా ఈవెంట్‌కు వచ్చిన వారిలో చాలామందిని పోలీసులు రోడ్డుపైనే అడ్డగించారు. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నామని, చాలాదూరం నుంచి వస్తున్నామని మొత్తుకున్నా సరే నోవాటెల్ సిబ్బంది, పోలీసులు వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. మహిళలు, పిల్లలు, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరినీ గేటు బయటకు నెట్టివేశారు. ఎలాగోలా గేటు దాటి లోనికి చేరుకున్నవారితో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
అమర్యాదగా మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్
ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చామని మీడియావాళ్లు చెప్పినా వినిపించుకోలేదు. విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ సహా ఇతర పీఆర్వోలను సైతం బయటకు నెట్టివేశారు. విఐపి, వీవీఐపీ పాసులు ఉన్నా కూడా అందర్నీ బయట నిలబెట్టారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు సైతం లోపల చాలామంది మీడియావాళ్లు ఉన్నారు, మీరు రాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదంటూ అమర్యాదగా మాట్లాడారు. వారికి సంబంధించినవారిని మాత్రం యధేచ్చగా లోపలకు తీసుకెళ్లారు.
ప్లానింగ్ లేకుండా ఈవెంట
పూర్తిగా ప్లానింగ్ లేకుండా ఈవెంట్ చేశారు. ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం ఐదు గంటలకే లోపల స్టేడియం నింపేశారు. ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా అడ్డంగా ఆపేశారు. సింగర్ చిన్మయి కూడా లోపలికి రావడానికి చాలా సేపు పట్టింది ఆమెను కూడా బయట పోలీసులు ఆపేశారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్లు చిన్న పని మీద బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేదని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment