టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి డిఫరెంట్ జానర్‌ను టచ్ చేయనున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌తో మరోసారి కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది.
VD14
నేడు (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దానిపై ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు.
చారిత్రక సంఘటనల ఆధారంగా..
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. చూస్తుంటే ఈ సారి విజయ్ పెద్ద హిట్టే ఇవ్వాలని ప్లాన్ చేసినట్లున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
'The Legend of the Cursed Land'
Rahul Sankrityan X Vijay Deverakonda @MythriOfficial pic.twitter.com/estyTYSUrj— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024
చదవండి: ఓటీటీలో పుష్ప విలన్ సూపర్ హిట్ మూవీ.. ఆ విషయంలో రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment