![Father Has Raped The Minor Daughter In Muzaffarpur - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/13/ddd.jpg.webp?itok=Ub_WN8J5)
ప్రతీకాత్మక చిత్రం
బీహార్: ముజఫర్‌పూర్ జాసన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ కూతురిపై తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చాందిని కుమారి సవారియా గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు దర్యాప్తులో బాలిక చేసిన ఆరోపణలు నిజమని తేలింది. ఈ కేసులో తండ్రీకూతుళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఘటనపై మహిళా పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు అర్థరాత్రి వారిద్దరినీ తమతో తీసుకెళ్లారు. గత శనివారం బాధితురాలు కోర్టులో వాంగ్మూలం దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, బాధితురాలి తండ్రిని కోర్టుకు అప్పగించారు.
ఈ కేసులో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై నిందితుడు బాలికకు ఫోన్ చేసి మళ్లీ రావాలని కోరారని ఎఫ్‌ఐఆర్‌లో తల్లి పేర్కొంది. లేని పక్షంలో వీడియో అందరికీ పంపుతానని బెదిరించినట్లు తెలిపింది. ఈ ఘటనపై గ్రామంలో మూడు రోజులుగా సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారు. ఐతే గ్రామానికి చెందిన 15 మంది నిందితుడిని కర్రలు, రాడ్లతో దేహశుద్ధి చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. కన్నతండ్రే కూతురిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఉందంతాలు ఈ మధ్యకాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. సభ్యసమాజం తలదించుకునే సంఘటనలు జరగటం విచారకరమని పోలీసధికారులు మీడియాకు తెలిపారు.
చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
Comments
Please login to add a commentAdd a comment