పోలీసుల ముందే భార్య హత్య.. జహీరాబాద్‌లో దారుణం! | Shocking Murder in Zaheerabad | Sakshi
Sakshi News home page

పోలీసుల ముందే భార్య హత్య.. జహీరాబాద్‌లో దారుణం!

Apr 6 2026 1:13 PM | Updated on Apr 6 2026 1:25 PM

Shocking Murder in Zaheerabad

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌కు చెందిన కవిత (29) అనే మహిళ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్‌ తో ఉన్నట్లు గుర్తించారు.

దీంతో కవితను తిరిగి జహీరాబాద్‌కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement