పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా శనివారం ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్ లుక్, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment