
టీవీ యాడ్స్ చూసే వాళ్లకు బాగా పరిచయం ఉన్న మెహం సాషా చెట్రిది. పేరు చెప్పగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఎయిర్‌టెల్ యాడ్‌లో కనిపించే పొట్టి జుట్టు అమ్మాయి అంటే మాత్రం వెంటనే మైండ్‌లో ఫ్లాష్ అయిపోతుంది. లుక్స్ లోనే కాకుండా చక్కని స్మైల్ తో యాక్టింగ్ తో ఆ యాడ్ రక్తి కట్టేలా బాగా నటించి సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది సాషా. ఈ బ్యూటీ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది సాషా. ఈ మూవీలో ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే సాషాకి ఇది తొలి సినిమా మాత్రం కాదు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా చిత్రంలో, అది కూడా ప్రభాస్ పక్కన నటించే అవకాశం సాషాని వరించింది. ఈ సినిమాతో అయినా సాషాకి మంచి గుర్తింపు వస్తుందో చూడాలి మరి. కాగా, రాధేశ్యామ్ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment