బాలీవుడ్ మార్కెట్ ను కబ్జా చేసేందుకు టాలీవుడ్ సీరియస్ గా ట్రై చేస్తోంది. అందుకే వరుసపెట్టి పాన్‌ఇండియా మూవీస్ నిర్మిస్తోంది. బాహుబలి సిరీస్, సైరా, సాహో లతో హిందీ సినీ మార్కెట్ లో వందల కోట్లు కొల్లగొట్టాయి తెలుగు చిత్రాలు. ఇప్పుడు ఈ వసూళ్లను పెంచుకునేందుకు త్వరలో భారీ ఎత్తున అక్కడ సినిమాలు విడుదల చేయనుంది టాలీవుడ్. డిసెంబర్ 17న పుష్పరాజ్ తొలిసారి బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.
జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్ భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ వీడియోస్ హిందీ ఆడియెన్స్ కు బాగా అలరిస్తూ వచ్చాయి. ఈ మూవీతో రామ్ చరణ్, తారక్ భారీ స్థాయిలో బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.
జనవరి 14న ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. బాహుబలి 2, సాహో మూవీస్ తో ప్రభాస్ బాలీవుడ్ బాక్సాపీస్‌ను పీస్ పీస్ చేసాడు. బాహుబలి 2 తో ఏకంగా 500 కోట్లు రాబట్టాడు. సాహో ఇండియా వైడ్ గా నిరాశపరిచినా, బాలీవుడ్ మాత్రం 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రాధే శ్యామ్ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. రాధేశ్యామ్ తర్వాత సేమ్ ఇయర్ ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది.
పూరి డైరెక్ట్ చేస్తున్న లైగర్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను గురి పెట్టింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ ఎవర్ బాలీవుడ్ మూవీ ఇది. పైగా అక్కడి స్టార్ మేకర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బీటౌన్ హార్ట్ త్రోబ్ అనన్య పాండే హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.
Comments
Please login to add a commentAdd a comment